Spiritual: ఈ మంత్రాలు మీ జీవితాన్నే మార్చేస్తాయి

Spiritual: కొన్ని మంత్రాలు రోజూ జ‌పించడం వ‌ల్ల మ‌న జీవితమే మారిపోతుంది. ప్ర‌శాంత‌మైన జీవితాన్ని అనుభ‌వించేలా చేసే శ‌క్తి మంత్రాల‌కు ఉంది.

ఓం న‌మః శివాయ‌

ఈ మంత్రం రోజూ జ‌పించ‌డం వ‌ల్ల జీవితంలో మీరు ఎదుర్కొంటున్న స‌మ‌స్య‌లు దూరం అవుతాయి. మిమ్మ‌ల్ని వేధిస్తున్న స‌మ‌స్య‌ల‌ను దూరం చేసేందుకు మార్గాన్ని చూపిస్తుంది ఈ శివ‌య్య మంత్రం.

ఓం గం గ‌ణ‌ప‌తాయే న‌మః

ఈ వినాయ‌క మంత్రాన్ని జ‌పించ‌డం వ‌ల్ల జీవితంలో క్లారిటీ వ‌స్తుంది. ఏకాగ్ర‌త ల‌భిస్తుంది. క్షుణ్ణంగా ఆలోచించి నిర్ణ‌యాలు తీసుకోగ‌లుగుతారు.

గాయ‌త్రి మంత్రం

ఇది అన్ని మంత్రాల‌లో శ‌క్తిమంత‌మైన‌ది. ఈ మంత్రం చ‌దివినా విన్నా మ‌న‌సు ప్ర‌శాంతంగా ఉంటుంది. పాజిటివిటీ పెరుగుతుంది.

ఓం హ్రీం శ్రీం ల‌క్ష్మీభ్యో న‌మః

ఇది ల‌క్ష్మీ దేవి మంత్రం. దీనిని జ‌పించ‌డం ద్వారా లక్ష్మీదేవి ఆశీస్సుల ఎల్ల‌ప్పుడూ మ‌న‌పై ఉంటాయి.

ఓం మ‌హా స‌ర‌స్వ‌తే న‌మః

చ‌దువుల త‌ల్లి స‌రస్వ‌తి మంత్రాన్ని పిల్ల‌లు జ‌పించ‌డం ద్వారా చ‌దువుపై ఏకాగ్ర‌త పెరుగుతుంది. నేర్చుకునే గుణం కూడా పెరుగుతుంది. పిల్ల‌ల చేత రోజూ ఈ మంత్రాన్ని నిర్మ‌ల‌మైన మ‌న‌సుతో జ‌పించేలా చేయండి.

ఓం హం హ‌నుమ‌తే న‌మః

మీరు ఏద‌న్నా టెన్ష‌న్‌లో ఉంటే ఈ ఆంజ‌నేయ స్వామి మంత్రాన్ని జ‌పించండి. టెన్ష‌న్ త‌గ్గి కాస్త ధైర్యం వ‌స్తుంది. ఏం చేయాల‌నే క్లారిటీ వ‌స్తుంది.