Devil సినిమా చుట్టూ రాజుకున్న వివాదం ఏంటి? అస‌లు ద‌ర్శ‌కుడు ఎవ‌రు?

Devil: నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్ (nandamuri kalyan ram) న‌టించిన డెవిల్ సినిమా త్వ‌ర‌లో రిలీజ్ అవ్వ‌నున్న నేప‌థ్యంలో ఈ సినిమా చుట్టూ వివాదం నెల‌కొంది. ఈ సినిమాను ముందు న‌వీన్ మేడారం (naveen medaram) డైరెక్ట్ చేసారు. ఈ క‌థ ఆయ‌న‌దే. ఒక మంచి సినిమాను ప్రేక్ష‌కుల‌కు అందించాల‌న్న ఉద్దేశంతో ఈ సినిమా తీయాల‌నుకున్నారు.

అయితే షూటింగ్ స‌గంలో ఉండ‌గా నిర్మాణ సంస్థ అభిషేక్ పిక్చ‌ర్స్ నిర్మాత అభిషేక్ నామా (abhishek nama) ఈ సినిమాను నేనే డైరెక్ట్ చేస్తా అనేసాడ‌ట‌. దాంతో పాపం న‌వీన్ మేడారంకు ఏం చేయాలో తెలీక త‌ప్పుకోవాల్సి వ‌చ్చింది. సినిమా క్రెడిట్స్‌లో కూడా ఎక్క‌డా న‌వీన్ పేరు వేయించ‌లేదు. దీనిపై న‌వీన్ మేడారం స్పందిస్తూ ఓ లెట‌ర్ రిలీజ్ చేసారు. ఎవ‌రు ఏమ‌న్నా డెవిల్ సినిమా కాన్సెప్ట్ త‌న‌దేన‌ని.. కానీ ఎందుకొచ్చిన గొడ‌వ అని మౌనంగా ఉండాల్సి వ‌స్తోంద‌ని తెలిపారు.

ఇప్పుడు త‌న‌కు మ‌రో మంచి అవ‌కాశం రావ‌డంతో వేరే సినిమా క‌థ‌ను ప్రిపేర్ చేసుకుంటున్నాన‌ని తెలిపారు. త‌న ప‌ట్ల ఇంత అన్యాయం జ‌రిగిన‌ప్ప‌టికీ డెవిల్ సినిమాను అంద‌రూ త‌ప్ప‌కుండా చూసి ఆద‌రించాల‌ని కోరారు. ఈ వివాదంపై క‌ళ్యాణ్ రామ్ స్పందించ‌లేదు. మీరూ మీరూ చూసుకోండి అన్న‌ట్లు మౌనంగా ఉండిపోయారు. న‌వీన్ మేడారం దాదాపు 105 రోజుల పాటు సినిమాను డైరెక్ట్ చేసారు. చివ‌రికి ఆయ‌న్ను ప‌క్క‌కు నెట్టేసి అభిషేక్ నామా ఎందుకు సినిమా క్రెడిట్స్ లాక్కున్నారో ఆయ‌నే క్లారిటీ ఇవ్వాలి.