RGV: పవన్, చంద్రబాబు, లోకేష్ చంపాలని ప్లాన్ వేసారనుకోవచ్చా?
RGV: తెలుగు దేశం పార్టీ (TDP) సపోర్టర్ అయిన కొలికపూడి శ్రీనివాస్ రావు(kolikapudi srinivas rao) లైవ్ టీవీలో రామ్ గోపాల్ వర్మ తల నరికి తెస్తే రూ.కోటి ఇస్తానని ప్రకటించడం సంచలనం సృష్టించింది. దీనిపై ఈరోజు విజయవాడలో డీజీపీని కలిసి ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు. అయితే అతను అంత బహిరంగంగా సవాల్ విసురుతుంటే చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్ కనీసం స్పందించడంలేదని.. దీని అర్థం వారే సుపారీ ఇచ్చి తనని చంపాలని చూస్తున్నారని మెల్లిగా క్లారిటీ వస్తోందని వర్మ అంటున్నారు.