Kolikapudi Srinivasa Rao: ” RGV త‌ల న‌రికి తెస్తే కోటి రూపాయ‌లు ఇస్తా”

Kolikapudi Srinivasa Rao: ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వ‌ర్మ (ram gopal varma) త‌ల న‌రికి తెచ్చిన‌వారికి కోటి రూపాయ‌లు ఇస్తాన‌ని లైవ్ టీవీలో కూర్చుని మ‌రీ స‌వాల్ విసిరారు తెలుగు దేశం పార్టీ (TDP) మ‌ద్ద‌తుదారుడు కొలిక‌పూడి శ్రీనివాస్ రావు.

తెలుగు దేశం పార్టీకి మ‌ద్ద‌తుగా ఉంటున్న ఒక టీవీ ఛానెల్‌లో శ్రీనివాస్ రావు డిబేట్‌లో పాల్గొన్నారు. వ‌ర్మ వ్యూహం పేరుతో తెలుగు దేశం పార్టీపై బుర‌ద జ‌ల్లే య‌త్నం చేస్తున్నార‌ని అలాంటి వ్య‌క్తికి బ‌తికే అర్హ‌త కూడా లేద‌ని షాకింగ్ వ్యాఖ్య‌లు చేసారు. ఈ డిబేట్‌పై రామ్ గోపాల్ వ‌ర్మ స్పందించారు. చంద్ర‌బాబు నాయుడు త‌న‌ను చంపేందుకు కోటి సుపారీ ఇచ్చేందుకు సిద్ధ‌ప‌డ్డార‌ని.. శ్రీనివాస్ రావుపై, టీవీ ఛానెల్ యాంక‌ర్‌పై తాను చ‌ట్ట‌ప‌ర‌మైన చ‌ర్య‌లు తీసుకోబోతున్న‌ట్లు వెల్ల‌డించారు.