Covid: తెలంగాణలో మొదటి మరణం
Covid: తెలంగాణలో మొదటి కోవిడ్ మరణం నమోదైంది. తెలంగాణ మొత్తంలో 55 యాక్టివ్ కోవిడ్ కేసులు ఉన్నాయి. వాటిలో అత్యధికంగా హైదరాబాద్లో 45 కేసులు నమోదయ్యాయి. ఉస్మానియా హాస్పిటల్లో ఒకరు మృతిచెందగా.. ఇద్దరు వైద్యులకు కరోనా సోకింది. కేసులు పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్ర ఆరోగ్య శాఖ టెస్టుల మోతాదును పెంచింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మాస్కులు తప్పనిసరిగా ధరించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.