Allu Arjun: బన్నీ బిజీ బిజీ.. లైన్‌లో నాలుగు!

Allu Arjun: స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్ర‌స్తుతానికి టాలీవుడ్‌లో బిజీ యాక్ట‌ర్ అయి చెప్పాలి. ప్ర‌స్తుతం సుకుమార్ డైరెక్ష‌న్‌లో పుష్ప- ది రూల్ (pushpa 2) సినిమాలో న‌టిస్తున్న బ‌న్నీ.. మ‌రో మూడు సినిమాల‌ను ఓకే చేసారు. ఈ సినిమా త‌ర్వాత ప్ర‌ముఖ త‌మిళ ద‌ర్శ‌కుడు అట్లీతో (atlee) ఓ సినిమాను ఓకే చేసారు. పుష్ప 2 త‌ర్వాత ఆ సినిమా షూటింగ్ స్టార్ట్ అవుతుంది. ఆ త‌ర్వాత త్రివిక్ర‌మ్ శ్రీనివాస్‌తో (trivikram srinivas) మ‌ళ్లీ క‌లిసి వ‌ర్క్ చేయ‌బోతున్నారు. ఇక సందీప్ రెడ్డి వంగా (sandeep reddy vanga) కూడా మాంచి కాన్సెప్ట్ రెడీ చేస్తున్నారు. చూడ‌బోతే టాలీవుడ్ మొత్తంలోనే బ‌న్నీ బిజియ‌స్ట్ యాక్ట‌ర్‌గా క‌నిపిస్తున్నారు.