AP Elections: మా బలమేదంటే.. మీపై నమ్మకమే..!
AP Elections: ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు ఇంకా మూడు నెలలే సమయం ఉన్న నేపథ్యంలో ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. వైఎస్ షర్మిళ.. (ys sharmila) తెలుగు దేశం పార్టీ (TDP) నేత నారా లోకేష్‌కు (nara lokesh) క్రిస్మస్ కానుక పంపండం జాతీయ చర్చగా మారింది.
అన్నపై కోపంతోనేనా?
జగన్ మోహన్ రెడ్డి 2019 ఎన్నికల్లో సీఎం అయ్యారు అంటే ఇందుకు 50% కారణం వైఎస్ షర్మిళ చేసిన పాదయాత్రే. షర్మిళ, తల్లి విజయమ్మ పాదయాత్ర చేయకపోయి ఉంటే జగన్ అన్ని సీట్లు వచ్చేవి కావు. జగన్ అక్రమ ఆస్తుల కేసులో జైలు పాలైనప్పుడు కూడా షర్మిళే అన్నీ దగ్గరుండి చూసుకుంది. అలాంటి చెల్లికి అధికారంలోకి వచ్చాక ఒక ఎంపీ స్థానాన్ని కూడా ఇప్పించలేకపోయాడు జగన్. ఆ తర్వాత ఆస్తి తగాదాలు కూడా రావడంతో షర్మిళ జగన్‌ను పూర్తిగా దూరం పెట్టేసింది.
ఆ తర్వాత ఏపీలో ఉంటే పని అవ్వదు అని నిర్ణయించుకున్న షర్మిళ తెలంగాణలో YSRTPను పెట్టి అందరికీ షాకిచ్చింది. ఆమె ఉండటం వల్ల కాంగ్రెస్ ఓట్లు చీలి అవి మళ్లీ BRSకే పడతాయేమోనని భావించిన కాంగ్రెస్ షర్మిళతో ఒక ఒప్పందం చేసుకుంది. షర్మిళ పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేస్తామని చెప్పింది. ఈ నేపథ్యంలో షర్మిళ.. ఖమ్మంలో పాలేరు సీటుతో పాటు ఇంకొన్ని సీట్లు కావాలని అడిగింది. ఇందుకు కాంగ్రెస్ ససేమిరా అంది.
దాంతో పార్టీ విలీనం ఆగిపోయింది. ఆ తర్వాత మళ్లీ షర్మిళ కాంగ్రెస్ సీనియర్ నేతలను కలిసి మీరు చెప్పినట్లే వింటాను అని చెప్పడంతో వారు జాతీయ స్థాయిలో హోదాను కల్పిస్తామని షర్మిళతో చెప్పారు. దాంతో తనను ఏపీ రాజకీయాల్లో వాడుకోవాలని అనుకుంటున్నారని షర్మిళకు అర్థమైపోయింది. ఇందుకు షర్మిళ ఒప్పుకోలేదు. అసలే తన అన్నతో ఆస్తి తగాదాలు ఉన్నాయి. మళ్లీ ఏపీలో కాలు పెడితే రావాల్సిన ఆస్తి కూడా రాకుండాపోతుందేమో అనేది షర్మిళ బాధ.
అందుకే TDPకి సపోర్ట్
అసలే 2019 ఎన్నికల్లో తనను గెలిపించిన ప్రముఖ రాజకీయ స్ట్రాటెజిస్ట్ ప్రశాంత్ కిశోర్ (prashant kishore) ఇప్పుడు తెలుగు దేశం పార్టీ చెప్పు చేతల్లో ఉన్నారు. ఇది ఎన్నికలకు ముందు జగన్‌కు తగిలిన పెద్ద షాక్ అని చెప్పాలి. మరోపక్క YCP నేతలు మెల్లిగా TDPలోకి వెళ్లిపోతున్నారు. ఇప్పుడు షర్మిళ తన అన్న ఫోకస్ తనపై ఉండేలా చూసుకోవాలంటే YSRCPకి ప్రధాన శత్రువు అయిన తెలుగు దేశం పార్టీకి సపోర్ట్ చేయాలి. అందుకే క్రిస్మస్ సందర్భంగా ఎప్పుడూ లేనిది షర్మిళ నారా లోకేష్‌కు కానుక పంపింది. ఆ తర్వాత జగన్ తన తల్లి విజయమ్మతో కలిసి కేక్ కట్ చేస్తున్న ఫోటోను రిలీజ్ చేయించారు. మొన్నటివరకు కనపడని తల్లి ఉన్నట్టుండి చెల్లి తెలుగు దేశం పార్టీకి సపోర్ట్ చేస్తుంటే ఇప్పుడు కనిపించిందా అని తెలుగు దేశం పార్టీ నేతలు ముక్కున వేలేసుకుంటున్నారు.
ఇప్పుడు షర్మిళకు తన ఆస్తి తనకు కావాలన్నా.. ఏపీలో అడుగుపెట్టాక ఒక మంచి పదవి కావాలన్నా కచ్చితంగా తెలుగు దేశం పార్టీ సపోర్ట్ కావాల్సిందే. ఒకవేళ 2024 ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన కలిసి అధికారాన్ని దక్కించుకుంటే కచ్చితంగా షర్మిళకు ఒక మంచి పోస్ట్ ఇచ్చి ఆదుకుంటారన్న టాక్ కూడా ఉంది.