Christmas: సాంటా క్లాజ్ వేషంలో ఝ‌ల‌క్ ఇచ్చిన‌ పోలీస్

Christmas: పాపం ఎవ్వ‌రూ ప‌ట్టుకోలేర‌న్న ధీమాతో ఇష్టారాజ్యంగా డ్ర‌గ్స్ అమ్మ‌కాల‌కు పాల్ప‌డుతున్న ఓ ముఠాకు ఊహించ‌ని క్రిస్మ‌స్ గిఫ్ట్ దొరికేసింది. సాంటా క్లాజ్ గెట‌ప్‌లో వ‌చ్చిన పోలీస్ వారిని చిత‌క‌బాది అరెస్ట్ చేసేసారు. ఈ ఘ‌ట‌న పెరూలో చోటుచేసుకుంది. పెరూలోని హువారెల్ అనే ప్రాంతంలో ఎక్కువ‌గా కొకైన్, మార్జువానా అమ్ముతుంటారు. మొత్తం పెరూ దేశంలోనే ఈ ప్రాంతం చాలా డేంజ‌ర్. సాధార‌ణ గెట‌ప్‌ల‌లో వెళ్తే ముఠా త‌ప్పించుకుంటుంద‌ని భావించిన ఇద్ద‌రు పోలీసులు సాంటా క్లాజ్ గెట‌ప్ వేసుకుని వెళ్లారు. అక్కడి వారికి క్రిస్మ‌స్ కానుక‌లు ఇస్తున్న‌ట్లు న‌టించి స‌క్సెస్‌ఫుల్‌గా ముఠాను ప‌ట్టుకున్నారు.