Kalyan Banerjee: “మోదీ వెక్కిరించినప్పుడు లేని బాధ ఇప్పుడెందుకు”
Kalyan Banerjee: ఇటీవల లోక్‌సభ సమావేశాలు (lok sabha) జరుగుతుండగా TMC నేత కళ్యాణ్ బెనర్జీ.. లోక్ సభ వైస్ ప్రెసిడెంట్ జగదీప్ ధన్కడ్ను (jagdeep dhankar) మిమిక్రీ చేసిన అంశం చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఆయన జగదీప్‌ను అలా వెక్కిరిస్తుంటే కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ వీడియో తీసారు. దీనిపై ఇంకా రచ్చ జరుగుతోంది.
దీనిపై కళ్యాణ్ వెస్ట్ బెంగాల్‌లోని తన నియోజకవర్గం అయిన సెరంపోర్‌లో మాట్లాడారు. ఒకసారి కాదు రెండు సార్లు కాదు వెయ్యి సార్లు ఇలాగే మిమిక్రీ చేస్తానని.. తన కంటే ముందు ప్రధాని నరేంద్ర మోదీ (narendra modi) మిమిక్రీ చేసారని ఆయన చేసినప్పుడు లేని బాధ తాను చేస్తే ఎందుకు వచ్చిందని ప్రశ్నించారు.
చిన్నపిల్లాడిలాగా టీచర్ కొడితే అమ్మకు ఫిర్యాదు చేసినట్లు వైస్ ప్రెసిడెంట్ ప్రవర్తిస్తున్నారని మిమిక్రీ అనేది ఒక కళ అని తెలుసుకోకపోతే దానిని తానేమీ చేయలేనని తన చర్యలను సమర్ధించుకున్నారు. తనను అదే లోక్ సభలో రైతు బిడ్డ అంటూ కామెంట్ చేసినప్పుడు ఎంతో బాధపడ్డానని.. జగదీప్ కూడా రైతు కుటుంబం నుంచే వచ్చి ఇప్పుడు రూ.20 లక్షల కోటు వేసుకుని పార్లమెంట్‌కు వస్తున్నారని ఆరోపించారు. ఇంత డబ్బు సంపాదించిన జగదీప్ రైతులకు కోసం ఏనాడైనా ఒక దుప్పటి దానం చేసారా అని ప్రశ్నించారు.