France లో చిక్కుకున్న మనోళ్ల పరిస్థితి ఏంటి? వారు క్షేమంగా ఉన్నట్లేనా?
France: దాదాపు 300 మంది భారతీయులు ఉన్న విమానం ఫ్రాన్స్‌లో చిక్కుకుపోయింది. వారిని దుబాయ్ నుంచి అక్రమంగా నికరాగువాకు తరలిస్తున్నారన్న సమాచారం రావడంతో నికరాగువాలో విమానాన్ని పారిస్‌లోని వాట్రీ ఎయిర్‌పోర్ట్‌లో నిలిపివేసారు. విమానంలో ఉన్న ఇద్దరు వ్యక్తులపై అనుమానం రావడంతో వారిని అదుపులోకి తీసుకుని విచారణ చేపడుతున్నారు. వారి పరిస్థితి ఏంటో తెలీక సతమతమవుతున్నారు. వీరిని మరో ఎనిమిది రోజుల పాటు తమ ఆధీనంలోనే ఉంచాలని ఫ్రాన్స్ జడ్జి ఒకరు ఆదేశాలు జారీ చేసారు. ఈరోజు కేసుకు సంబంధించి వాదోపవాదాలు విననున్నారు.
ఫ్రాన్స్ సరిహద్దులోని భద్రతా దళాలు తమకు ఎవరిమీదైనా అనుమానం ఉంటే నాలుగు రోజుల పాటు తమ ఆధీనంలో పెట్టుకునేందుకు అనుమతి ఉంటుంది. ఇలా 26 రోజుల పాటు 8 సార్లు తమ ఆధీనంలో ఉంచుకునే అవకాశం ఉంది. తమ ఆధీనంలో ఉంటే ఇతర ప్రాంతాలకు వెళ్లే అవకాశం కూడా ఉండదు. ఫ్రాన్స్‌లోని భారత దౌత్యాధికారులు యాక్సిస్ తీసుకుని అందరి పాస్‌పోర్ట్ వీసాలను చెక్ చేస్తున్నారు. విమానంలో ఎవ్వరి తోడూ లేకుండా ఎక్కిన 11 మంది మైనర్లు కూడా ఉన్నారు. దాంతో వారిని అక్రమంగా నికరాగువా తరలించేందుకే విమానంలోకి ఎక్కించుకున్నట్లు ఫ్రాన్స్ అధికారులకు సమాచారం అందింది. మానవుల అక్రమ రవాణాల కేసుల్లో ఫ్రాన్స్ ప్రభుత్వం 20 ఏళ్లు కఠిన కారాగార శిక్ష వేస్తుంది.