Bonus: పనిని బట్టి కాకుండా ఫిట్‌నెస్‌ని బట్టి బోనస్‌లు ఇచ్చే కంపెనీ!
Bonus: ఎంత బాగా పని చేస్తే అంత ఎక్కువ బోనస్, ఇంక్రిమెంట్లు ఇచ్చే కంపెనీలను చూసుంటాం. కానీ చేసిన పనిని బట్టి కాకుండా ఆరోగ్యాన్ని, ఫిట్‌నెస్‌ని బట్టి బోనస్‌లు ఇచ్చే కంపెనీ గురించి ఎప్పుడైనా విన్నారా? ఈ కంపెనీ చైనాలోని గ్వాంగ్డాంగ్ ప్రావిన్స్‌లో ఉంది.
డాంగ్పో అనే పేపర్ తయారీ కంపెనీలో ఈ వింత రూల్ ఉంది. నెలలో ఉద్యోగులు ఎంత వ్యాయామం చేసారు.. ఎంత వాకింగ్ జిమ్ చేసారు.. వంటి అంశాలను తెలుసుకుని దానిని బట్టి ప్రతి నెలా బోనస్ ఇస్తోందట. ఒక ఉద్యోగి నెలలో 50 కిలోమీటర్లు నడిస్తే 100 శాతం బోనస్ వస్తుంది. అదే 100 కిలోమీటర్లు నడిస్తే 130 శాతం ఎక్కువ బోనస్ వస్తుంది. ఫిట్నెస్ వివరాలు నమోదు చేసేందుకు ఓ యాప్‌ను ఇన్స్టాల్ చేయిస్తారు. ఈ యాప్‌లో అంతా రికార్డ్ అవుతుంది. ఏ ఉద్యోగి కూడా మోసం చేసేందుకు వీల్లేదు.
ఇలాంటి ప్లాన్ ఎందుకు పెట్టారు అనే అంశంపై కంపెనీ బాస్ లిన్ స్పందించారు. ఓ ఉద్యోగి ఫిట్‌గా ఆరోగ్యంగా ఉంటేనే ఎక్కువ పనిచేయగలుగుతాడని.. వారి ఆరోగ్యాన్ని పట్టించుకోకుండా గంటలు గంటలు ఎక్కువ పనిచేయించుకుంటే ఆరోగ్యం దెబ్బ తిని సెలవులు పెట్టేస్తారని తెలిపారు. అందుకే ఈ ప్లాన్ అమలు చేసామని.. దీని వల్ల ఉద్యోగుల ఆరోగ్యంతో పాటు కంపెనీ లాభాలు కూడా బాగున్నాయని చెప్తున్నారు. ఇలాంటి ప్లాన్ మన ఇండియాలోనూ ఉంటే ఎలా ఉంటుందంటారు?