Gujarat: మ‌ద్య ర‌హిత ప్రాంతంగా పేరుగాంచి..ఇప్పుడెందుకు మ‌ద్యం అమ్ముతోంది?

Gujarat: గుజ‌రాత్.. ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ (narendra modi) పుట్టిన ఈ రాష్ట్రం మ‌ద్య ర‌హిత ప్రాంతంగా పేరుగాంచింది. 1960 నుంచి డ్రై స్టేట్‌గా ఉన్న ఈ రాష్ట్రంలో ఇప్పుడు ఉన్న‌ట్టుండి మ‌ద్యం అమ్మ‌కాలు జ‌రుగుతున్నాయి. ఎందుకు?

గాంధీ న‌గ‌ర్‌లోని గుజ‌రాత్ ఫైనాన్స్ టెక్ సిటీలో (GIFT) మ‌ద్యం అమ్మ‌కాలు చేసుకోవ‌చ్చ‌ ని ఆ రాష్ట్ర ప్ర‌భుత్వం ఆదేశాలు జారీ చేయ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ఈ టెక్ సిటీ భార‌త్‌లోనే తొలి అతిపెద్ద ఫైనాన్షియ‌ల్ స‌ర్వీస్ సెంట‌ర్. ఈ టెక్ సిటీకి గ్లోబ‌ల్ ఇన్‌వెస్ట‌ర్లు కూడా గుజ‌రాత్‌లో పెట్టుబ‌డులు పెట్టేందుకు వ‌స్తుంటారు. వారిని స్వాగతించే స‌మ‌యంలో వైన్ అండ్ డైన్ కాన్సెప్ట్ ఉంటే బాగుంటుంద‌ని ఆ రాష్ట్ర ప్ర‌భుత్వం భావించింది. అందుకే ఒక మోతాదు వ‌ర‌కు నిబంధ‌న‌ల‌తో కూడిన మ‌ద్యాన్ని అమ్ముకోవ‌చ్చ‌ని ఆదేశాలు జారీ చేసింది. ఈ టెక్ సిటీలో ప‌నిచేసేవారికి లిక్క‌ర్ యాక్సిస్ ఉంటుంది. అంటే ఈ సిటీ ప్రాంగ‌ణం వ‌ర‌కే వారు మ‌ద్యం సేవించ‌వ‌చ్చు.