“కియాలో జాబ్ వ‌చ్చింది.. థ్యాంక్స్ చంద్ర‌బాబు”

Chandrababu naidu: ఓ ట్విట‌ర్ యూజ‌ర్ TDP అధినేత చంద్ర‌బాబు నాయుడు వ‌ల్ల త‌న‌కు కియా మోట‌ర్స్‌లో (kia motors) జాబ్ వ‌చ్చింద‌ని ట్వీట్ చేయ‌డం వైరల్‌గా మారింది. చంద్ర‌బాబు నాయుడుని క‌ల‌వ‌క‌పోయినా ఆయ‌న‌కు త‌న బాధ‌ను చెప్పుకుంటే కియాలో ఉద్యోగం ఇప్పించార‌ట. ఈ విష‌యాన్ని ఆ పేరులేని యూజ‌ర్ ట్వీట్ చేస్తూ చంద్ర‌బాబుకు థ్యాంక్స్ చెప్తూ ఆయ‌న్ను ట్యాగ్ చేసారు. ఈ పోస్ట్‌పై TDP అధికారిక ట్విట‌ర్ స్పందించింది. ఆల్ ది బెస్ట్ దోస్త్ అని. దాంతో చాలా మంది ఈ ట్వీట్‌పై తెగ కామెంట్స్ చేస్తున్నారు.

కియా మోట‌ర్స్‌లో జాబ్ రాని వారి ప‌రిస్థితి ఏంటి అని ప్ర‌శ్నిస్తున్నారు. మ‌రికొంద‌రు నెటిజ‌న్లు ఇది పెయిడ్ ట్వీట్ అని.. నారా లోకేష్ (nara lokesh) ఫేక్ అకౌంట్ నుంచి చేసి ఉంటాడ‌ని అంటున్నారు. ఓర‌కంగా ఇదీ నిజ‌మే అనిపిస్తోంది. అయినా ఆ యూజ‌ర్ ఖాతా పేరు టీవుడ్ త‌లైవా అని ఉంది. పైగా బ‌యోలో ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, రామ్‌ చ‌ర‌ణ్‌, మ‌హేష్ బాబుల‌ను ట్రోల్ చేయొద్దు అంటూనే వారిని పావ‌లా, మ‌బ్బు, చెడ్డీ అని రాసాడు. ఈ బ‌యో చూస్తుంటే ఇత‌ను ఎన్టీఆర్ ఫ్యాన్ అని క్లియ‌ర్‌గా తెలుస్తోంది. ఇలా ఎవ‌రు ప‌డితే వారు ట్వీట్స్ చేసిన‌ప్పుడు వాటికి TDP అధికారిక ట్విట‌ర్ రిప్లై ఇవ్వ‌డంలో అర్థంలేదు. ఇలా చేయ‌డం వ‌ల్ల వారి స్థాయిని త‌గ్గించుకున్న‌ట్లే అవుతుంది.