KTR: అప్పులు కాదు.. ప్రతీది పెట్టుబడే
KTR: KCR సర్కారు హయాంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో వేలాది కోట్లతో అభివృద్ధి చేసామని అప్పులనే మాటే లేకుండా ఎన్నో పెట్టుబడులు తీసుకొచ్చామని అన్నారు KTR.
2014లో ఉమ్మడి జిల్లాలో కేవలం 218 విద్యుత్తు ఉప కేంద్రాలు ఉంటే, కేసీఆర్ సర్కారు వాటి సంఖ్యను 351 కేంద్రాలకు పెంచింది. పదేళ్లలో 149 కొత్త విద్యుత్తు ఉప కేంద్రాలను ఏర్పాటు చేసింది ట్రాన్స్ఫార్మర్లు చూస్తే 2014లో కేవలం 53,247 మాత్రమే ఉండగా, అవి 78,958 పెరిగాయి. పదేళ్లలో 25,711 ట్రాన్స్ఫార్మర్లను ఏర్పాటు చేసింది. 2014కు ముందు ఉమ్మడి జిల్లాలో చూస్తే.. కేవలం 3.83 లక్షల ఎకరాల్లో మాత్రమే వరి సాగయ్యేది. ప్రస్తుతం ఆ విస్తీర్ణం 12.35 లక్షలకు పెరిగింది. రైతుబంధు కింద 11 విడుతల్లో 7,750.68 కోట్ల పెట్టుబడి సాయం అందించింది.
ఉమ్మడి జిల్లాలో 2014 వరకు 588 పరిశ్రమలు ఉండగా, 192 కోట్ల పెట్టుబడి ఉంది. వీటిలో 2,603 మందికి ఉద్యోగావకాశాలు కల్పించినట్లు ఆనాటి గణాంకాలు చెబుతున్నాయి. కానీ, గడిచిన ప్రభుత్వంలో చూస్తే పూర్వ జిల్లాలో కొత్తగా 4,764 పరిశ్రమలు ఏర్పాటయ్యాయి. 19,085 కోట్ల పెట్టుబడులు రాగా, 34,964 మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి దొరుకుతున్నది. ఉమ్మడి జిల్లాలో 2016లో కేవలం 77 పీహెచ్సీలు ఉంటే, వాటిని 93కు పెంచింది. ఆ దవాఖానల్లో 1,342 బెడ్స్ మాత్రమే ఉంటే, వాటిని 2,850కి పెంచింది. సిబ్బంది సంఖ్యను 3,149 నుంచి 4,318కి పెంచింది. అలాగే కేసీఆర్ ప్రభుత్వం జిల్లాకో మెడికల్ కాలేజీ ఇచ్చింది అని KTR లెక్కలతో సహా బయటపెట్టారు.