WFI: మహిళా రెజ్లర్ల పట్ల ఏం జరుగుతోంది? మెడల్స్ సాధించిన వీరు ఎందుకు కుస్తీ వదిలేస్తున్నారు?
WFI: మహిళా రెజ్లర్ల పట్ల కొంతకాలంగా అన్యాయం జరుగుతోందనే చెప్పాలి. ఇందుకు కారణం రెజ్లర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా చీఫ్‌గా వ్యవహరిస్తున్న బ్రిజ్ భూషణ్ శరణ్ సింగే (brij bhushan sharan singh) కారణం. ఇతను బీజేపీ నేత కూడా. ఇతని వల్ల మహిళా రెజ్లర్లు అయిన వినేష్ ఫోగాట్ (vinesh phogat), సాక్షి మాలిక్‌లతో (sakshi malik) పాటు ఎందరో అమ్మాయిలు లైంగిక వేధింపులకు గురయ్యారు. దాదాపు ఏడాదిగా న్యాయం కోసం వీరు పోరాడుతున్నారు.
ఈ మేరకు చాలా మంది మహిళా రెజ్లర్లు బ్రిజ్ భూషణ్‌పై కేసులు వేసారు. ఇటీవల కోర్టు కూడా ఈ కేసులను పరిశీలిస్తూ బ్రిజ్ భూషణ్ చేసింది తప్పే అని చెప్పింది కానీ ఇంకా శిక్ష పడలేదు. విచారణ జరుగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో నిన్న రెజ్లర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా చీఫ్‌గా సంజయ్ సింగ్ (sanjay singh) అనే వ్యక్తిని నియమించారు. సంజయ్ సింగ్ ఎవరో కాదు. బ్రిజ్ భూషణ్‌కు బాగా కావాల్సిన వ్యక్తి. దాంతో ఇంతకాలంగా న్యాయం కోసం పోరాడుతున్న మహిళా రెజ్లర్లు షాక్ అయ్యారు.
దాంతో ఇక తమ పోరాడి కూడా వేస్ట్ అని భావించి కుస్తీకి స్వస్తి పలికారు. మీడియా ముందే తమ కుస్తీ బూట్లను తీసేసి ఇక తాము ఈ దేశం కోసం బరిలోకి దిగి కూడా వృథానే అంటూ కన్నీరుపెట్టుకున్నారు. ఇక్కడ విచిత్రం ఏంటంటే.. ప్రధాని నరేంద్ర మోదీ ఈ అంశాన్ని పెద్దగా పట్టించుకోకపోవడం. దేశం కోసం ఎన్నో మెడల్స్ సాధించి తీసుకొచ్చిన ఆడపిల్లలు అలా వేధింపులకు లోనై ఏడుస్తుంటే కఠిన చర్యలు తీసుకోవాల్సిందిపోయి బ్రిజ్ భూషణ్ చెప్పిందే నమ్ముతున్నారు. నిజానికి మోదీ తలుచుకుంటే ఫెడరేషన్ చీఫ్‌గా ఓ మహిళా రెజ్లర్‌నే నియమించే అవకాశం ఉంది. కానీ మోదీ ఈ అంశంపై చర్చించకపోవడం గమనార్హం.