Free Bus Travel: బ‌స్సుల్లో ఉచిత ప్ర‌యాణం.. ఈ కొత్త రూల్ గురించి తెలుసా?

Free Bus Travel: తెలంగాణ‌లో మ‌హిళ‌ల‌కు ఉచిత బ‌స్సు ప‌థ‌కాన్ని అమ‌లు చేసిన సంగ‌తి తెలిసిందే. మ‌హిళ‌లంతా ఆధార్ కార్డు చూపించి బస్సుల్లో ప్ర‌యాణించాల్సి ఉంటుంది. ఈ నేప‌థ్యంలో TSRTC ఎండీ స‌జ్జ‌నార్ (sajjanar) ఓ కొత్త రూల్‌ను ప్ర‌కటించారు. మ‌హిళ‌లంతా ఒరిజిన‌ల్ ఆధార్ కార్డు చూపించి బ‌స్సు ఎక్కాల్సి ఉంటుంది. చాలా మంది ఆడ‌వాళ్లు ఒరిజిన‌ల్ ఆధార్ కార్డు చూపించ‌కుండా ఫోన్ల‌లో పెట్టుకున్న ఆధార్ కార్డు ఫోటోల‌ను చూపిస్తున్నారు. ఇక నుంచి అలా కుద‌ర‌ద‌ని.. చేతిలో ఆధార్‌కార్డు లేక‌పోతే టికెట్ తీసుకోవాల్సిందేన‌ని స‌జ్జ‌నార్ ఆదేశాలు జారీ చేసారు.

ఒక‌వేళ ఆధార్ కార్డు లేక‌పోతే ఓట‌ర్ ఐడీ, డ్రైవింగ్ లైసెన్స్ కూడా చూపించి బ‌స్సు ఎక్క‌చ్చు. అయితే ఏ ఐడీ ప్రూఫ్ చూపించినా కూడా అందులో ప్యాసెంజ‌ర్ల ముఖం క్లియ‌ర్‌గా క‌నిపించాల‌ని కూడా స‌జ్జ‌నార్ అన్నారు. చాలా మంది చిన్న‌ప్ప‌టి ఫోటోలు ఉన్న ఆధార్ కార్డులే వాడుతున్నార‌ని త్వ‌ర‌లో ఫోటోల‌ను అప్‌డేట్ చేయించుకుంటే మంచిద‌ని వెల్ల‌డించారు. ఉచిత ప్ర‌యాణం కారణంగా బ‌స్సుల్లో ర‌ద్దీ ఎక్కువ అవుతున్న నేప‌థ్యంలో త్వ‌ర‌లో 2050 కొత్త బ‌స్సుల‌ను లాంచ్ చేయ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించారు.