నీకు పెళ్లి అవ్వదు.. నటికి నెటిజన్ సలహా
ఈ మధ్యకాలంలో సోషల్ మీడియా పుణ్యమా అని ప్రతి ఒక్కడూ సలహా ఇచ్చేవాడే. సెలబ్రిటీల పర్సనల్ విషయాల్లోనూ కొందరు నెటిజన్లు ఇది కరెక్ట్ కాదు, మీరు ఆ సినిమాలో ఎందుకు నటించారు, ఆ వ్యక్తిని ఎందుకు పెళ్లి చేసుకున్నారు.. ఇలా ఎవరి అభిప్రాయాలు వారు వెల్లడిస్తూ ఉంటారు. చాలా మంది సెలబ్రిటీలు ఈ కామెంట్స్‌ని అస్సలు పట్టించుకోరు. కానీ కొందరు మాత్రం అలా కామెంట్ చేసేవారికి బుద్ధిచెప్పడానికి దీటుగా సమాధానం ఇస్తుంటారు. ప్రముఖ హిందీ బుల్లితెర నటి దల్జీత్ కౌర్‌కు ఇలాంటి సంఘటనే ఎదురైంది. దల్జీత్ 2009లో షాలిన్ భానోత్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకున్నారు. వీరికి ఒక బాబు కూడా ఉన్నాడు. కానీ వ్యక్తిగత కారణాల వల్ల వారు విడిపోయారు.
ఇప్పుడు దల్జీత్.. నిఖిల్ పటేల్ అనే వ్యాపారవేత్తను వివాహం చేసుకున్నారు. వీరిద్దరూ కాళ్లపై ఓ టాటూ వేయించుకున్నారు. వారి పెళ్లి తేదీ వచ్చేలా టాటూ వేయించుకుని ఫొటోలు దిగారు. ఆ ఫొటోలను దల్జీత్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసారు. అయితే ఆ టాటూలు చూసిన ఓ నెటిజన్ కామెంట్ చేస్తూ.. “ముందు ఆ టాటూ తీసేయండి, ఇలా ఉంటే మీకు పెళ్లి అవ్వదు, సమస్యలు వస్తాయి” అని కామెంట్ చేసాడు. ఈ నెటిజన్‌కు దల్జీత్ దీటుగా సమాధానం ఇచ్చారు. “కేవలం టాటూ వల్ల సమస్యలు వస్తాయంటే రానివ్వండి. మహా అయితే ఏమవుతుంది. ఈ పెళ్లి బంధం కూడా తెగిపోనివ్వండి. అంతకంటే దారుణం ఏమీ జరగదు కదా. ముందే ఏదో జరుగుతుందని భయపడి ముందడుగు వేయకపోతే జీవితంలో చాలా నష్టపోతాం” అని తెలిపారు.