KTR: రాష్ట్రం అప్పుల్లో ఉంటే కొత్త సీఎంకు కొత్త క్యాంప్ ఆఫీస్ అవసరమా?
KTR: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి (revanth reddy) రాష్ట్ర అప్పులపై విడుదల చేసిన శ్వేత పత్రంపై మండిపడ్డారు BRS నేత KTR. అది శ్వేతపత్రం కాదని అబద్ధాల పుట్టని మండిపడ్డారు. ఎంతో అభివృద్ధి చెందిన తెలంగాణ రాష్ట్రం గురించి తప్పుడు ప్రచారం చేస్తున్నందుకు సిగ్గుపడాలని విమర్శించారు. వారు చెప్పినట్లు నిజంగానే రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోయి ఉంటే మరి కొత్త సీఎంకు కొత్త క్యాంప్ ఆఫీస్ నిర్మాణం ఎందుకు అని ప్రశ్నించారు. తెలంగాణ భవన్‌ను ఢిల్లీలో ఎందుకు నిర్మించాలని ప్లాన్ వేస్తున్నారని వంద రోజుల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చాల్సిన అంశంపై ఎందుకు ఫోకస్ చేయడం లేదని ప్రశ్నల వర్షం కురిపించారు. 100 రోజుల నోటీస్ పీరియడ్‌కు కౌంట్ డౌన్ మొదలైందని అన్నారు.