IPL: రోహిత్ కంటే ముందు వీరిని కెప్టెన్లుగా తొలగించారు
2024 IPL సందడి ఇప్పుడిప్పుడే కాస్త మొదలైనట్లు కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఐదు సార్లు టైటిల్ గెలిచిన ముంబై ఇండియన్స్ (mumbai indians) తమ చిరకాల కెప్టెన్ అయిన రోహిత్ శర్మను (rohith sharma) కెప్టెన్సీ బాధ్యతల నుంచి తొలగించింది. ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా హార్దిక్ పాండ్య (hardik pandya) వ్యవహరించనున్నాడు. అయితే ఇలా IPL సమయంలో రోహిత్ కంటే ముందు ముగ్గురు టాప్ కెప్టెన్లు కూడా ఎలిమినేషన్ ఎదుర్కొన్నారు. వారెవరంటే..
మహేంద్ర సింగ్ ధోనీ (ms dhoni)
2016 IPL సమయంలో ధోనీ (dhoni) రైసింగ్ పుణె సూపర్ జైంట్ (rising pune super giants) టీంకు కెప్టెన్‌గా వ్యవహరించేవాడు. ఆ సమయంలో కొన్ని కారణాల వల్ల 2017 సమయానికి ధోనీని కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పించారు. ఆయన స్థానంలో స్టీవ్ స్మిత్‌ని (steve smith) ఎంపికచేసారు. స్టీవ్ స్మిత్‌ని ఎంపిక చేసిన తర్వాత టీం సరిగ్గా ఆడలేకపోయింది. 2017లో టైటిల్‌ను ముంబై ఇండియన్స్ సొంతం చేసుకుంది.
రవీంద్ర జడేజా (ravindra jadeja)
2022 ఐపీఎల్ సమయంలో ధోనీ చెన్నై సూపర్ కింగ్స్ (chennai super kings) జట్టు కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకుని అందరినీ షాక్‌కు గురిచేసాడు. ఆ సమయంలో తన బాధ్యతలను రవీంద్ర జడేజాపై పెట్టాడు. 8 మ్యాచ్‌లలో రెండు మాత్రమే గెలిచేసరికి జడేజాను కెప్టెన్సీ పదవి నుంచి తప్పించారు. ఆ తర్వాత మళ్లీ ధోనీనే కెప్టెన్‌గా కొనసాగుతూ వస్తున్నాడు.
అజింక్య రహానే (ajinkya rahane)
2019 ఐపీఎల్ సమయంలో రాజస్థాన్ రాయల్స్ (rajasthan royals) కెప్టెన్సీ పదవి నుంచి రహానేను తప్పించారు. ఆయన స్థానంలో స్టీవ్ స్మిత్‌ను ఎంపికచేసారు. వరల్డ్ కప్ దగ్గరపడుతున్న సమయంలో ప్రాక్టీసింగ్ కోసం ముందుగానే ఆస్ట్రేలియాకు వెళ్లిపోతాడని తెలిసీ స్టీవ్ స్మిత్‌ను కెప్టెన్‌ను చేయడం గమనార్హం.