Pawan Kalyan: “ఇది జ‌గ‌న్ ముద్దులాట లాంటి పాద‌యాత్ర కాదు”

Pawan Kalyan: ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి (jagan mohan reddy) 2018 ఎన్నిక‌ల స‌మ‌యంలో పాద‌యాత్ర చేసిన సంగ‌తి తెలిసిందే. నిజానికి ఆయ‌న్ను పాద‌యాత్రే గెలిపించింది. అయితే జ‌గ‌న్ చేసిన పాదయాత్ర కంటే ఆయ‌న ప్ర‌జ‌ల‌కు పెట్టిన ముద్దుల గురించే అప్ప‌ట్లో పెద్ద చ‌ర్చ జ‌రిగింది. చిన్నా పెద్దా ఆడా మ‌గా అనే తేడా లేకుండా అంద‌రికీ బుగ్గ‌ల‌పై ముద్దులు పెట్టేసేవారు. ఇప్పుడు ఈ అంశం గురించే జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ళ్యాణ్ (pawan kalyan) న‌వ‌శ‌కం కార్య‌క్ర‌మంలో ప్ర‌స్తావించారు. ఇది నారా లోకేష్ చేసిన పాదయాత్ర జగన్ గారి పాదయాత్ర లాంటిది కాదు, బుగ్గలు నిమిరే పాదయాత్ర కాదు ఇది, కష్టాలు తెలుసుకున్న పాదయాత్ర అని ఆయ‌న జ‌గ‌న్ పాద‌యాత్ర‌పై సెటైర్ వేసారు.