Tirupathi Reddy: మీటింగ్‌ల‌లో సీఎం సోద‌రుడికి ఏం ప‌ని?

Tirupathi Reddy: త‌ల్లిదండ్రులు ఆఫీస్‌కి వెళ్లేట‌ప్పుడు ఒక్కోసారి పిల్ల‌ల‌ని కూడా వెంట‌బెట్టుకుని తీసుకెళ్తుంటారు. దాంతో వారు ఆఫీస్‌లోనే ఆడుకుంటూ ఎంజాయ్ చేస్తుంటారు. పిల్ల‌ల్ని తీసుకెళ్తే ఫ‌ర్వాలేదు కానీ సీఎం త‌మ్ముడు కూడా ఇలా పిల్లాడిలాగే ప్ర‌వ‌ర్తిస్తే? తెలంగాణ ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి (revanth reddy) సోద‌రుడు తిరుప‌తి రెడ్డి ఓ ప్ర‌భుత్వ మీటింగ్‌లో ఇలా క‌నిపించారు.

అస‌లు ఆయ‌న ఎవ‌రు? మంత్రా.. ఎమ్మెల్యేనా? ఏ అధికారంతో ఆయ‌న ఇలా ప్ర‌భుత్వ మీటింగ్‌ల‌కు అటెండ్ అవుతున్నారు? సీఎం త‌మ్ముడైతే ఏదైనా చేసేయొచ్చా? అనే విమ‌ర్శ‌లు ప్ర‌జ‌ల నుంచి వ్యక్తం అవుతున్నాయి. ఎన్నిక‌ల కౌంటింగ్ స‌మ‌యంలో కూడా రేవంత్ మ‌రో సోద‌రుడు అయిన కొండ‌ల్ రెడ్డి పోల్ కోడ్ ఉల్లంఘించి మ‌రీ కౌంటింగ్ బూత్ వ‌ద్ద‌కు వెళ్ల‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది.