David Warner: ఎంత అవ‌మానం.. వార్న‌ర్‌ను బ్లాక్ చేసిన SRH

David Warner: డేవిడ్ వార్న‌ర్ అంటే ఆయ‌న దేశంలో ఎంత ప్రేమ ఉందో తెలీదు కానీ మ‌న తెలుగు వారికి ఎంతో అభిమానం. వార్న‌ర్ మావా అంటూ ప్రేమ‌గా పిలుస్తారు. ఆయ‌న్ను స‌న్ రైజ‌ర్స్ హైద‌రాబాద్ (sunrisers hyderabad) కెప్టెన్సీ నుంచి తొల‌గించిన‌ప్పుడు చాలా మంది బాధ‌ప‌డ్డారు. అయితే ఇప్పుడు స‌న్ రైజ‌ర్స్ హైద‌రాబాద్ అధికారిక ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్ నుంచి వార్న‌ర్‌ను ఏకంగా బ్లాక్ చేసేసారు.

ఇంత‌కంటే అవ‌మాన‌క‌రం మ‌రొక‌టి ఉండ‌దు. నిన్న జ‌రిగిన IPL 2024 వేలంలో ట్రావిస్ హెడ్‌ను (travis head) స‌న్ రైజ‌ర్స్ హైద‌రాబాద్ జ‌ట్టు సొంతం చేసుకుని ఆయ‌న్ను కెప్టెన్‌గా ప్ర‌క‌టించింది. ఈ నేప‌థ్యంలో ట్రావిస్ హెడ్‌కు కంగ్రాట్స్ చెప్ప‌డానికి వార్న‌ర్ స‌న్ రైజ‌ర్స్‌ను ట్యాగ్ చేసాడు. తీరా చూస్తే త‌న‌ను బ్లాక్ చేసిన‌ట్లు వ‌చ్చింద‌ట‌. పైకి ఈ అంశాన్ని జోక్‌గా తీసుకున్న‌ప్ప‌టికీ వార్న‌ర్ చాలా బాధ ప‌డి ఉంటాడ‌ని పాపం ఫ్యాన్స్ కూడా ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు. స‌న్‌రైజ‌ర్స్ జ‌ట్టు ట్రావిస్ హెడ్‌ను రూ.6.8 కోట్ల‌కు ద‌క్కించుకుంది.