Prashanth Neel: నల్ల రంగే ఎందుకు.. క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్
Prashanth Neel: KGF సినిమా చూసాక అంతా నలుపే కనిపిస్తుంటే పోనీలే ఏదో కొత్తగా చూసినట్లుంది అనుకున్నారు ఆడియన్స్. ఆ తర్వాత KGF 2 కూడా అదే నలుపు రంగులో తీసారు. దాంతో ప్రశాంత్ నీల్‌పై మీమ్స్, కామెంట్స్ మామూలుగా రాలేదు. కర్ణాటకలో బొగ్గు కొరత ఉందంటే అందుకు కారణం నీల్ బొగ్గంతా సినిమాలో వాడేస్తున్నాడంటూ తెగ మీమ్స్ వచ్చేవి. ఇప్పుడు ప్రభాస్‌తో (prabhas) తీసిన సలార్ (salaar) కూడా అదే నల్ల రంగులో తీసాడు. దాంతో అసలు ప్రశాంత్‌కు నలుపు తప్ప ఇతర రంగులేవీ కనిపించవేమో అని కూడా అనుకుంటున్నవారూ ఉన్నారు.
అయితే ఈ నల్ల రంగుపై మిస్టరీ వీడేలా సమాధానం ఇచ్చేసారు నీల్. పాపం నీల్‌కి ఓసీడీ ఉందట. అంటే అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్. ఈ రుగ్మత ఉన్నవారు ఒక షెడ్యూల్ ఫాలో అవుతుంటారు. ఫలానా వస్తువు ఇలాగే ఉండాలి.. ఈ పని ఇలాగే చేయాలి అని. వీరికి ఈ షెడ్యూల్లో స్వల్ప మార్పు వచ్చిందంటే చాలు అల్లాడిపోతారు. నీల్‌కి ఉన్న ఓసీడీ ఏంటంటే.. ఆయనకు అన్ని రంగులు నచ్చవట. కేవలం నలుపే ఇష్టం. అందుకే తన సినిమాల్లో కూడా నల్ల రంగునే వాడి తీస్తుంటానని వెల్లడించారు. హమ్మయ్య.. ఈ నల్ల రంగు విషయంలో అయితే క్లారిటీ వచ్చేసింది.