AP Elections: ముక్కూ మొహం తెలీని నేత‌ల‌ను పార్టీలోకి ఆహ్వానించేస్తున్న సీఎం

AP Elections: ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ఎన్నిక‌ల న‌గారా మోగ‌కుండానే సీఎం జ‌గ‌న్ (jagan mohan reddy) ఇప్ప‌టినుంచి అప్ర‌మ‌త్తంగా పావులు క‌దుపుతున్నారు. మ‌ళ్లీ గెల‌వాల‌న్న తాప‌త్ర‌యంతోనో.. మ‌ళ్లీ గెలుస్తామో లేదోన‌న్న భ‌యంతోనో ఎవ‌రు ప‌డితే వారికి పార్టీ కండువాలు క‌ప్పి ఆహ్వానించేస్తున్నారు. పైగా వారంతా కూడా ఇదివ‌ర‌కు జ‌న‌సేనలో (janasena) ఉండేవాళ్ల‌మ‌ని చెప్పి మ‌రీ పార్టీలోకి దూరుతున్నార‌ట‌. ఈ ఐదేళ్ల‌లో సొంత పార్టీ నేత‌లకు తాడేప‌ల్లి ప్యాలెస్‌లోకి ఎంట్రీ ద‌క్క‌లేదు. కానీ ఇలాంటి చోటా మోటా వ్య‌క్తుల‌ను తాడేప‌ల్లి ప్యాలెస్‌కు పిలిపించుకుని మ‌రీ కండువాలు క‌ప్పి పార్టీలోకి ఆహ్వానించేస్తున్నారు. ఇలాగైతే సొంత గూటి నేత‌లు రాజీనామాల చేసి వేరే పార్టీలోకి జంప్ అయిపోరా? జ‌గ‌న్ ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్స‌య్యారో అని రాజ‌కీయ విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు.