నువ్వు కొత్త‌గా వ‌చ్చిన‌వ్ గ‌డ్‌బ‌డ్ చేయ‌కు.. పాడి కౌశిక్ రెడ్డికి స్పీక‌ర్ కౌంట‌ర్

Telangana Assembly: తెలంగాణ అసెంబ్లీలో మ‌ళ్లీ ర‌చ్చ జ‌రిగింది. సీఎం రేవంత్ రెడ్డి (revanth reddy) BRS ప్ర‌భుత్వం చేసిన త‌ప్పుల గురించి చ‌ర్చిస్తుంటే BRS ఎమ్మెల్యేలు అబ‌ద్ధాలు చెప్ప‌కండి ఆపండి అంటూ ర‌చ్చ చేసారు. ఆ ఎమ్మెల్యేలలో పాడి కౌశిక్ రెడ్డి (padi kaushik reddy) కూడా ఉన్నారు.

దాంతో స్పీక‌ర్‌కు ఒళ్లుమండింది. ఎంత చెప్తున్నా విన‌క‌పోవ‌డంతో..  గౌర‌వ‌నీయ కౌశిక్ రెడ్డి గారు మీరు అసెంబ్లీకి మొద‌టిసారి వ‌చ్చారు. లీడ‌ర్ ఆఫ్ ది హౌస్ మాట్లాడుతున్న‌ప్పుడు గ‌డ్ బ‌డ్ చేయ‌కూడ‌దు. మీకు అవ‌కాశం ఇచ్చిన‌ప్పుడు మాట్లాడండి అని మంద‌లించారు.