Dawood Ibrahim: అండ‌ర్‌వ‌ర‌ల్డ్ డాన్‌పై విష ప్రయోగం.. కరాచీ హాస్పిట‌ల్‌కు త‌ర‌లింపు

Dawood Ibrahim: మోస్ట్ వాంటెడ్ అండ‌ర్ వ‌ర‌ల్డ్ డాన్ దావూద్ ఇబ్ర‌హీంపై విష ప్రయోగం జ‌రిగింది. దాంతో ఆయ‌న్ను పాకిస్థాన్‌లోని క‌రాచీ హాస్పిట‌ల్‌లో భారీ భ‌ద్ర‌త మ‌ధ్య ఉంచి చికిత్స అందిస్తున్నారు. కేవ‌లం హాస్పిట‌ల్‌లోని టాప్ డాక్ట‌ర్లు, పోలీస్ అధికారులు, దావూద్ కుటుంబ స‌భ్యుల‌కు మాత్ర‌మే అనుమ‌తి ఉంది. దావూద్ గురించి మ‌రింత స‌మాచారం రాబ‌ట్టేందుకు ముంబైలో ఉన్న ఆయ‌న బంధువుల‌ను పోలీసులు ఆరా తీస్తున్నారు. దావూద్ రెండో వివాహం చేసుకున్నాక క‌రాచీలోనే ఉంటున్నాడ‌ని.. ఆయ‌న త‌న అనుచ‌రుల‌తో క‌రాచీ ఎయిర్‌పోర్ట్‌ను త‌న కంట్రోల్‌లో పెట్టుకున్నాడ‌ని ఆయ‌న మేన‌ల్లుడు పోలీసుల‌కు వెల్ల‌డించాడు.