Manchu Manoj: తండ్రి కాబోతున్న మంచు మ‌నోజ్

Manchu Manoj: న‌టుడు మంచు మ‌నోజ్ తండ్రి కాబోతున్నాడు. త‌న భార్య మౌనిక శుభ‌వార్త చెప్పిన‌ట్లు ప్ర‌క‌టించారు. ఈ విష‌యాన్ని ఆయ‌న త‌న అత్తగారు, దివంగ‌త నేత శోభా నాగి రెడ్డి గురించి ప్ర‌స్తావిస్తూ ట్విట‌ర్‌లో పోస్ట్ చేసారు. “” అత్త‌మ్మా.. మీరు మ‌ళ్లీ అమ్మ‌మ్మ కాబోతున్నారు. మా ధైర‌వ్ అన్న‌య్య కాబోతున్న‌ట్లు ఎంతో హ్యాపీగా ఉన్నాడు. మీరు, మామ‌య్య పై నుంచి మమ్మ‌ల్ని ఆశీర్వ‌దిస్తున్నార‌ని.. మీ ఆశీస్సులు ఎప్ప‌టికీ మాపై ఉంటాయ‌ని ఆశిస్తున్నాం “” అని తెలిపారు.