టీచర్‌తో విద్యార్ధి పాడు పని.. రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న తల్లి
ఏ తల్లికీ ఇలాంటి అనుభవం ఎదురుకాకూడదు. బుద్ధిగా చదువు చెప్పాల్సిన టీచర్..(teacher) స్టూడెంట్‌తో శృంగారం చేస్తూ దొరికిపోయింది. తన బిడ్డ చదువుకుంటున్నాడని అనుకుంటున్న ఆ కన్నతల్లికి ఈ ఘోరాన్ని కళ్లారా చూసి గుండె పగిలింది. ఈ దారుణ ఘటన అమెరికాలో చోటుచేసుకుంది. మేరీ అనే మహిళ తన 18 ఏళ్ల కుమారుడిని స్థానిక సౌత్ మెక్లెన్‌బర్గ్ అనే హై స్కూల్‌లో చేర్పించింది. అయితే కొంతకాలంగా మేరీ కుమారుడు స్పోర్ట్స్ పీరియడ్ సమయంలో కనిపించకుండా పోతున్నాడని.. కొన్నిసార్లు టీచర్‌తో చనువుగా ఉండటం చూసామని మేరీకి ఫిర్యాదులు వచ్చాయి.
ఎవరు ఎంత చెప్పినా బిడ్డను ఏమీ అనలేక మేరీ మౌనంగా ఉండిపోయింది. నిన్న ఉదయం మేరీ తన కుమారుడు చదువుతున్న స్కూల్‌కి వెళ్లింది. స్పోర్ట్స్ పీరియడ్ జరుగుతుండగా పిల్లలంతా గ్రౌండ్‌లో ఆడుకుంటున్నారు. కానీ మేరీ కుమారుడు మాత్రం లేడు. దాంతో తన బిడ్డ గురించి వస్తున్న ఫిర్యాదులన్నీ నిజమో కాదో తెలుసుకోవాలనుకుంది.
ఇందుకోసం వివాదాస్పదమైన లైఫ్ 360 అనే యాప్ డౌన్‌లోడ్ చేసుకుంది. ఈ యాప్‌ను అమెరికాలోనే కాదు వివిధ దేశాల్లో కూడా బ్యాన్ చేయాలని పిటిషన్లు వచ్చాయి. ఈ యాప్ ద్వారా అవతలి వ్యక్తి ఫోన్ నెంబర్‌తో వారు ఎక్కడున్నారో తెలిసిపోతుంది. ఈ యాప్‌లో చూడగా తన కుమారుడు స్కూల్ బిల్డింగ్ వెనక ఉన్న పార్కింగ్‌లో ఉన్నట్లు తెలిసింది. వెంటనే మేరీ వెళ్లి చూడగా తన కుమారుడు ఓ కారులో టీచర్‌తో శృంగారం చేస్తూ కనిపించాడు. అది చూసి భరించలేకపోయిన మేరీ నేరుగా వెళ్లి ఏమీ అనలేక పోలీసులను పిలిపించి టీచర్‌ను అరెస్ట్ చేయించింది. కుమారుడిని కౌన్సిలింగ్‌కు తీసుకెళ్లింది. తన బిడ్డపై ఎలాంటి కేసులు ఫిర్యాదులు వద్దు అని బతిమిలాడితే పోలీసులు వార్నింగ్ ఇచ్చి వదిలేసారు.