KTR: న‌క్క ఎవ్వ‌రినీ మోస‌గించ‌న‌ని ప్ర‌మాణ స్వీకారం చేసిన‌ట్లుంది

Telangana Assembly: నిన్న తెలంగాణ అసెంబ్లీలో గ‌వ‌ర్న‌ర్ త‌మిళిసై (tamilisai) చేసిన ప్ర‌సంగం ప‌ట్ల ఆగ్రహం వ్య‌క్తం చేసారు BRS ఎమ్మెల్యే KTR. గ‌వ‌ర్న‌ర్ ఇలా మాట్లాడ‌తార‌ని అనుకోలేద‌ని.. ఆమె ప్ర‌సంగం అసెంబ్లీలో ఇలా వినాల్సి వ‌చ్చినందుకు సిగ్గుప‌డుతున్నాన‌ని ఆవేద‌న వ్య‌క్తం చేసారు. ఒక న‌క్క ఎవ్వ‌రినీ మోస‌గించ‌న‌ని ప్ర‌మాణ స్వీకారం చేసిన‌ట్లు.. ఒక పులి తోటి జంతువుల‌ను సంహ‌రించ‌ను అని ప‌శ్చాత్తాపం ప్ర‌క‌టించిన‌ట్లే గ‌వ‌ర్న‌ర్ ప్ర‌సంగం ఉంద‌ని పంచ్‌లు వేసారు. త‌మ పార్టీ ఎక్క‌డున్నా ప్ర‌జా ప‌క్ష‌మే అని తెలిపారు.