Israel: పొరపాటున బందీల‌ను చంపేసిన ఇజ్రాయెల్

Israel Gaza War: గాజాపై యుద్ధం ఆపను అని మొండికేస్తున్న ఇజ్రాయెల్ స‌రిదిద్దుకోలేని పొరపాటు చేసింది. హ‌మాస్ ఉగ్ర‌వాదులు అనుకుని ఇజ్రాయెల్‌కు చెందిన ముగ్గురు బందీల‌ను చంపేసింది. ఆ త‌ర్వాత విష‌యం తెలిసి నాలుక క‌ర్చుకుంది. ఈ విష‌యంపై ఇజ్రాయెల్ ప్ర‌ధాని బెంజమిన్ నేతన్యాహు (benjamin netanyahu) స్పందిస్తూ.. ఇది జీర్ణించుకోలేని న‌ష్టం అని అన్నారు. హ‌మాస్ చెర‌లో ఇజ్రాయెల్‌కి చెందిన 131 మంది బందీలు ఉన్నార‌ని అంచ‌నా. అయితే వారంతా బ‌తికే ఉన్నారా లేదా అనేది ప్ర‌శ్నార్ధ‌కంగా మారింది.