Rohit Sharma: 5 సార్లు టైటిల్ గెలిచిన రోహిత్‌ను ఎందుకు పక్కన పెట్టారు?
Rohit Sharma: ఐదు సార్లు టైటిల్ గెలిచిన ముంబై ఇండియన్స్ (mumbai indians) జట్టుకి 2024 IPLలో హార్దిక్ పాండ్య (hardik pandya) కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. ఇప్పటివరకు కెప్టెన్‌గా వ్యవహరిస్తూ వస్తున్న రోహిత్ శర్మను పక్కన పెట్టి హార్దిక్ పాండ్యకు బాధ్యతలు అప్పగిస్తున్నట్లు ముంబై ఇండియన్స్ టీం ప్రకటన విడుదల చేసింది. ఇందుకు సరైన కారణాలు వెల్లడించలేదు.
గత రెండేళ్ల పాటు గుజరాత్ టైటాన్స్‌కు (gujarat titans) సారథ్యం వహించిన హార్దిక్ పాండ్యను ఇటీవల ముంబై ఇండియన్స్ తన జట్టులోకి తీసుకుంది. అప్పుడే రోహిత్‌ను మారుస్తారేమో అన్న సందేహాలు వ్యక్తమయ్యాయి. అయితే 2023 IPLలో రోహిత్ శర్మ సారథ్యంలో టీం సరిగ్గా ఆడలేకపోయిందని.. వారు ఇబ్బందులకు గురయ్యారని రవి శాస్త్రి (ravi sastri) క్రికెట్ బోర్డుకు తన రివ్యూలో పేర్కొన్నారట. అదీకాకుండా మొన్న జరిగిన ప్రపంచ కప్‌లోనూ రోహిత్ శర్మ సారథ్యంలో టీమిండియా ఓడిపోయిన అంశాన్ని కూడా పరిగణనలోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.
ఈసారి ఎలాగైనా ముంబై ఇండియన్స్ టైటిల్ గెలవాల్సిందేనని అంబానీలు దృఢంగా నిర్ణయించుకున్నారు. అందుకే ఐదు సార్లు టైటిల్ గెలుచుకున్న రోహిత్‌ను పక్కన పెట్టేందుకు కూడా సంకోచించలేదు. అలాగని హార్దిక్ పాండ్యను తీసిపారేయలేం. ఇతను కూడా బెస్ట్ ఆటగాళ్లలో ఒకడు. కానీ రోహిత్ అంత గొప్పగా అయితే పెర్ఫామ్ చేయలేడు కదా అని ఫ్యాన్స్ కూడా తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తూ ట్వీట్స్, కామెంట్స్ పెడుతున్నారు.