Supreme Court: అబ్బా.. ప్రతీసారి మీ ఎంట్రీ ఏంటి అని విసుక్కున్న కోర్టు!
Supreme Court: ఈ మధ్యకాలంలో సుప్రీంకోర్టు వరకు వెళ్తున్న సమస్యలు ఎక్కువైపోతున్నాయి. ఇప్పటికే ఎన్నో పెండింగ్ కేసులు ఉన్నాయని తలబాదుకుంటున్న సుప్రీంకోర్టు.. ఇక నా వల్ల కాదు బాబోయ్ అనేంతగా డీలా పడిపోతోంది. అయితే ఇప్పుడు సుప్రీంకోర్టుకు మరో తలనొప్పి ఏర్పడింది. అదేంటంటే.. ఢిల్లీ ప్రభుత్వం వర్సెస్ లెఫ్ట్‌నెంట్ గవర్నర్ (delhi vs lt governor) కేసు.
సాధారంగా ఢిల్లీ ప్రభుత్వానికి లెఫ్ట్‌నెంట్ గవర్నర్‌కు ఏ విషయంలో అయినా విభేదాలు వస్తే ముందు ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించాలి. కానీ వీళ్లు మాత్రం నేరుగా సుప్రీంకోర్టుకు వెళ్తున్నారు. దాంతో సుప్రీంకోర్టు.. ప్రతిసారీ మీ ఎంట్రీ ఏంటి అని విసుక్కుంది. ఢిల్లీకి చెందిన పిల్లల హక్కుల కమిషన్ (DCPCR) లెఫ్ట్‌నెంట్ గవర్నర్ తమకు రావాల్సిన ఫండ్స్ ఆపేసారని ఢిల్లీ ప్రభుత్వానికి ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో ఢిల్లీ ప్రభుత్వం తరఫు న్యాయవాది లెఫ్ట్‌నెంట్ గవర్నర్‌పై సుప్రీంకోర్టులో కేసు వేసారు. ఈ కేసును పరిశీలించిన న్యాయమూర్తి ఢిల్లీ హైకోర్టుకు వెళ్లకుండా ఎందుకు నేరుగా సుప్రీంకోర్టుకు వచ్చారని నిలదీసారు.
దీనిపై ఢిల్లీ ప్రభుత్వం తరఫు న్యాయవాది వాదిస్తూ.. ఇది సాధారణ కేసు కాదని పిల్లల హక్కులకు భంగం కలిగించేలా లెఫ్ట్‌నెంట్ గవర్నర్ ప్రవర్తిస్తున్నారని తెలిపారు. ఈ వాదన విన్న న్యాయమూర్తి.. అందుకే కదా ఢిల్లీ హైకోర్టు ఉంది. అక్కడి ఎందుకు వెళ్లలేదు? సుప్రీంకోర్టు యావత్ రాజ్యాంగాన్ని పరిరక్షించే పెద్ద పెద్ద కేసులను మాత్రమే డీల్ చేస్తుంది అని మందలించారు. ఈ కేసు విషయాన్ని వెంటనే పరిశీలించాలని న్యాయవాదే స్వయంగా ఢిల్లీ హైకోర్టుకు ఆదేశాలు జారీ చేసారు.