16వ యేట ఇండస్ట్రీలోకి.. 17 ఏళ్లకే పెళ్లి.. 18 ఏళ్లకి విడాకులు
Urvashi Dholakia: సినిమా రంగం అనేది కలల ప్రపంచం. ఈ ఇండస్ట్రీకి వచ్చేవారు చక చకా అవకాశాల కోసం వెతుక్కుంటూ నాలుగు రాళ్లు వెనక్కేసుకోవాలని చూస్తారు. ఈ క్రమంలోనే తోటి నటీనటులతో ప్రేమలో పడి వారిని వివాహం చేసుకుని సెటిల్ అయిపోతుంటారు. ఇలా సినిమా రంగంలోని వారిని పెళ్లి చేసుకుని ఆనందంగా ఉన్నవారు ఉన్నారు.. విడిపోయిన వారూ ఉన్నారు.
అయితే.. 16వ యేట ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి.. 17వ యేటనే అంటే మైనర్‌గా ఉండగానే పెళ్లి చేసేసుకున్న నటి గురించి మీకు తెలుసా. ఈమె మన తెలుగువారికి తెలీదు. కానీ బాలీవుడ్‌లో మంచి పేరు తెచ్చుకుంది. కసౌటీ జిందగీ కే (kausautii zindaki kay) అనే సీరియల్‌తో ఎంట్రీ ఇచ్చి మంచి పాపులారిటీ తెచ్చుకుంది. ఆమే ఊర్వశీ ఢొలాకియా.
సీరియల్‌లో నటిస్తున్న సమయంలోనే ఓ వ్యక్తిని గాఢంగా ప్రేమించి పెళ్లి కూడా చేసేసుకుంది ఊర్వశి. కాకపోతే ఆమెకు 18 ఏళ్లు వచ్చినప్పుడు ఈ విషయాన్ని బయటపెట్టింది. పెళ్లి చేసుసుకుంటే చేసుకుంది.. కానీ 17వ యేటనే.. అంటే ఇంకా మైనర్‌గా ఉండగానే ఇద్దరు కవలలకు జన్మనివ్వడం ఇక్కడ షాకింగ్ విషయం. పోనీ హాయిగా సంసారం చేసుకుంటున్నారా అంటే అదీ లేదు. 18 ఏళ్లు రాగానే పెళ్లి చేసుకునేవారికి చూసి ఉంటాం కానీ ఈవిడ మాత్రం విడాకులు తీసుకున్నారు.
ఇంకా దురదృష్టకరమైన విషయం ఏంటంటే.. తన పిల్లలకు తండ్రి ఎవరు ఎలా ఉంటారు అనేది కూడా తెలీదు. ఇప్పుడు ఊర్వశి ఢొలాకియా వయసు 44. ఇప్పటికీ ఆమె పిల్లలకు తండ్రి ఎవరనేది చెప్పకుండా చూసుకుంటోంది. ఓ ఇంటర్వ్యూలో తన జీవితం గురించి చెప్తూ ఇప్పుడిప్పుడు ఇండస్ట్రీకి వస్తున్న పిల్లలు తాను చేసిన తప్పు చేయొద్దు అంటూ విన్నవించుకుంటోంది.