Payal Rajput: పాయల్‌పై ఎందుకు అంత నెగిటివిటీ..?
Payal Rajput: RX 100 సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు నటి పాయల్ రాజ్‌పుత్. ఆ వెంటనే వెంకీ మామ (venky mama) సినిమాలో మంచి హోమ్లీ క్యారెక్టర్లో కనిపించారు. ఆ తర్వాత కూడా మంచి హోమ్లీ క్యారెక్టర్స్ కోసం వెయిట్ చేసి ఓకే చేసి ఉంటే పాయల్ కెరీర్ మరోలా ఉండేది. కానీ ఆమె అన్నీ శృంగార భరితమైన కాన్సెప్ట్‌లను ఎంచుకోవడంతో ఇప్పుడు పాయల్‌ను వేరే ఉద్దేశంతో చూస్తున్నారు. సోషల్ మీడియాలో అయితే పాయల్‌పై నెగిటివిటీ మామూలుగా లేదు.
ఇటీవల మంగళవారం (mangalavara) సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన పాయల్‌పై శృంగార సన్నివేశాలకు మాత్రమే పనికొస్తారు అనే ముద్ర పడిపోయింది. ఈ ముద్రను తొలగించుకుని మంచి నటి అనిపించుకోవాలంటే మాత్రం మంచి కీ రోల్స్ పడాలి. ఇందుకోసమే పాయల్ కాంతారలో (kantara) అవకాశం ఇవ్వరూ.. అంటూ రిషబ్ శెట్టికి ట్విటర్లో నేరుగా రిక్వెస్ట్ పెట్టారు.
పాయల్‌కు రిషబ్ అవకాశం ఇస్తారో లేదో తెలీదు కానీ ఇప్పుడు ఆమెకు కేవలం శృంగారభరితమైన సన్నివేశాలు ఉన్న పాత్రలే వస్తున్నాయట. ఈ పాత్రల్లో నటించే బదులు ఆరు నెలల పాటు పని లేకుండా ఇంట్లో కూర్చోవడం బెటర్ అని పాయల్ బాధపడుతున్నారు. గతంలో బాలీవుడ్ నటులు నీనా గుప్తా, తాప్సిలు కూడా వర్క కావాలని ట్విటర్ ద్వారా రిక్వెస్ట్ చేసారని అందులో ఏమాత్రం తప్పు లేదని చెప్పుకొచ్చారు.