Pooja Hegde: పూజా హెగ్డేను చంపేస్తామని బెదిరించింది ఎవరు.. ఏం జరిగింది?
Pooja Hegde: నటి పూజా హెగ్డేకు బెదిరింపులు వచ్చాయని పుకార్లు వినిపిస్తున్నాయి. ఇటీవల ఓ క్లబ్ ఓపెనింగ్ కోసం దుబాయ్ వెళ్లిన పూజ అక్కడ ఎవరితోనో గొడవ పెట్టుకున్నారని దాంతో వారు చంపేస్తామటూ బెదిరింపులకు పాల్పడ్డారని అంటున్నారు. దీనిపై పూజ టీం స్పందించింది. ఇలాంటి ఘటన ఏదీ కూడా చోటుచేసుకోలేదని.. ఎవరు ఇలాంటి రూమర్స్ సృష్టిస్తున్నారో తెలీడంలేదని క్లారిటీ ఇచ్చారు. ఇక సినిమాల విషయానికొస్తే ప్రస్తుతానికి పూజ చేతిలో ఏవీ లేవు. గుంటూరు కారంలో (guntur kaaram) నటించాల్సి ఉంది కానీ కొన్ని కారణాల వల్ల సినిమా నుంచి తప్పుకోవాల్సి వచ్చింది.