Chandrababu Naidu: వ్య‌వ‌సాయం గురించి తెలిస్తే ఉల్లిగ‌డ్డ‌కు ఆలుగ‌డ్డ‌కు తేడా తెలుస్త‌ది

Chandrababu Naidu: మిగ్‌జాం (michaung) తుఫాను క‌లిగించిన న‌ష్టం త‌న రాజ‌కీయ జీవితంలో ఇంత వ‌ర‌కూ చూడ‌లేద‌ని అన్నారు TDP అధినేత చంద్ర‌బాబు నాయుడు. తుఫాను కారణంగా ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో దాదాపు 26 ల‌క్ష‌ల పంట పొలాలు న‌ష్ట‌పోయాయని.. ఇప్ప‌టివ‌ర‌కు సీఎం జ‌గ‌న్ (jagan mohan reddy) రైతుల‌ను ఆదుకునేందుకు ఏమీ చేయ‌లేద‌ని మండిప‌డ్డారు. మిగ్‌జాం తుఫాను జాతీయ విప‌త్తుగా ప్ర‌క‌టించాల‌ని తానే కేంద్రానికి రాసాన‌ని.. కానీ జ‌గ‌న్ ప్ర‌భుత్వం సాయం కోసం నిధులు కావాల‌ని క‌నీసం కేంద్రానికి ఒక్క లేఖ కూడా రాయ‌లేద‌ని తెలిపారు.

ఇటీవ‌ల జ‌గ‌న్ ప్ర‌భుత్వం కేంద్రాన్ని ఫండ్స్ కావాల‌ని కోరుతూ రూ.3000 కోట్ల మేర కావాల‌ని అడిగార‌ని.. అది చూసి త‌న‌కు ఆశ్చ‌ర్య‌మేసింద‌ని పేర్కొన్నారు. రూ.700 కోట్లు అడిగితేనే రూ.100 ఇస్తార‌ని అలాంటిది రూ.3000లో రూ.2500 కోట్లు ఆర్ అండ్ బీ రోడ్ల‌కు పోతే ఇక మిగ‌తావి అస‌లు రైతుల‌కు ఆదుకునేందుకు ఎలా స‌రిపోతాయ‌ని ప్ర‌శ్నించారు. ఒక తుఫాను, క‌రువు వ‌స్తే ఏం చేయాలో కూడా రాష్ట్ర ముఖ్య‌మంత్రికి తెలీక‌పోతే ఎలా అని ఎద్దేవా చేసారు. కొండ నాలుక‌కు మందేస్తే ఉన్న నాలుక పోయిన‌ట్లు జ‌గ‌న్ చ‌క్క‌గా ఏర్పాటు చేసిన వ్య‌వ‌స్థ‌ల‌ను కూడా పాడుచేసేసార‌ని మండిప‌డ్డారు. వ్య‌వ‌సాయం గురించి తెలిస్తేనే ఉల్లిగ‌డ్డ‌కు ఆలుగ‌డ్డ‌కు తేడా తెలుస్తుంద‌ని సెటైర్ వేసారు.

త‌న రాజ‌కీయ జీవితంలో ఎన్నో పార్టీల‌ను చూసాన‌ని.. కానీ YSRCP పార్టీకి వ‌చ్చిన వ్య‌తిరేక‌త ఏ పార్టీకి రాలేద‌ని తెలిపారు. దీనిని బ‌ట్టే ప్ర‌జ‌లు ఎంత అస‌హ్యించుకుంటున్నారో క్లియ‌ర్‌గా తెలుస్తోంద‌ని అన్నారు. ఈరోజు నిరుద్యోగంలో ఏపీ నెంబ‌ర్ 1గా ఉంద‌ని.. చ‌దువు మీద పిల్ల‌ల్లో నిరాస‌క్తి క‌లుగుతోంద‌ని అన్నారు.