Animal: న‌వ్వినా నోటికొచ్చిన‌ట్లు తిట్టేవాడు.. సందీప్‌పై న‌టుడి కామెంట్స్

Animal: సందీప్ రెడ్డి వంగా (sandeep reddy vanga) డైరెక్ట్ చేసిన యానిమ‌ల్ సినిమా బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ అందుకుంది. ఇందులో కేపీ సింగ్ (kp singh) అనే న‌టుడు కూడా కీల‌క పాత్ర పోషించారు. షూటింగ్ స‌మ‌యంలో సందీప్ రెడ్డి వంగా త‌న‌ను నోటికొచ్చిన‌ట్లు తిట్టేవాడ‌ని అంటున్నారు కేపీ సింగ్. సెట్స్‌లో క‌నీసం న‌వ్వినా కూడా ఎలా ప‌డితే అలా మాట్లాడేవార‌ని కానీ తాను వాటిని పట్టించుకోలేద‌ని అన్నారు. ఏదైనా ప‌ని చేస్తున్న‌ప్పుడు ఒక‌రు తిడుతున్నారు అంటే ఏదో ఒక కొత్త విష‌యం నేర్చుకుంటామ‌ని అర్థం అంటూ పాజిటివ్‌గా స్పందించారు కేపీ సింగ్.