Mohammed Shami: BCCI చొర‌వ‌తో.. అర్జున అవార్డు రేసులో ష‌మీ..!

Mohammed Shami:  భార‌త పేస‌ర్ మ‌హ‌మ్మ‌ద్ షమీ క్రీడా రంగంలో రెండో అతిపెద్ద పుర‌స్కారం అయిన అర్జున అవార్డు (arjuna award) రేసులో ఉన్నారు. 2023 అవార్డుల కార్య‌క్ర‌మంలో ష‌మీకి అర్జున అవార్డు ల‌భించే అవ‌కాశం ఉంది. ODI వ‌ర‌ల్డ్ కప్ సెమీ ఫైన‌ల్స్‌లో ష‌మీ ఏ రేంజ్‌లో అద‌ర‌గొట్టారో క్రికెట్ ప్రియుల‌కు తెలిసిందే. నిజానికి వ‌చ్చే ఏడాది ప్ర‌దానం చేయ‌నున్న అర్జున అవార్డుల జాబితాలో ష‌మీ పేరు లేదు. కానీ BCCI చొరవ తీసుకుని ష‌మీ పేరుని చేర్చాల‌ని క్రీడా శాఖ‌ను కోరింది.