Netflix: 2023లో మోస్ట్ వాచ్డ్ సిరీస్ ఇదే..!
Netflix: అతిపెద్ద ఎంటర్‌టైన్‌మెంట్ ప్లాట్‌ఫాం అయిన నెట్‌ఫ్లిక్స్ 2023 మొత్తంలో అత్యధికంగా వీక్షించిన సిరీస్‌ల లిస్ట్‌ను రిలీజ్ చేసింది. ప్రతి ఏడాది డిసెంబర్‌లో నెట్‌ఫ్లిక్స్ ఈ డేటాను రిలీజ్ చేస్తుంది. అలా ఈ ఏడాది కూడా డేటాను రిలీజ్ చేసింది. 2023లో నెట్‌ఫ్లిక్స్‌లో అత్యధికంగా వీక్షించిన వెబ్ సిరీస్‌లు సినిమాలు ఇవే..!
ది నైట్ ఏజెంట్ (the night agent) అనే పొలిటికల్ థ్రిల్లర్ 2023లో అత్యధిక వ్యూస్ సాధించింది. 2023లో రిలీజ్ అయిన ఈ సిరీస్‌కు ఇప్పటివరకు 812.1 మిలియన్ గంటల వీక్షణతో టాప్‌లో నిలిచింది. ఆ తర్వాత స్థానంలో గిన్నీ అండ్ జార్జియా (ginny & georgia) సీజన్ 2 వెబ్ సిరీస్ ఉంది.