Free Bus Travel: పడిపోయిన TSRTC ఆదాయం
Free Bus Travel: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అనేది ఒకటి. రేవంత్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన మరుసటి రోజే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సదుపాయాన్ని అమల్లోకి తెచ్చారు. ఈ ఉచిత పథకం ప్రవేశపెట్టినప్పటి నుంచి బస్సుల్లో మహిళా ప్రయాణికుల సంఖ్య 60 శాతానికి పెరిగింది.
సోమవారం 51 లక్షల మంది ప్రయాణించగా అందులో 20.87 లక్షల మంది పురుషులు కాగా 30 లక్షల మంది మహిళలు ఉచిత ప్రయాణం చేశారు. సాధారణంగా ఆర్టీసీలో 50 లక్షల మంది ప్రయాణికులు ఎక్కితే రూ.18 కోట్లు ఉండే ఆదాయం సోమవారం రూ.11.74 కోట్లు వచ్చింది. ఇలాగే కొనసాగితే TSRTC ఆదాయం దారుణంగా పడిపోతుంది. మళ్లీ ఆ భారం మధ్యతరగతి వారిపైనే పడుతుందనే విషయం తెలంగాణ ప్రభుత్వం మర్చిపోయినట్లుంది.