Suniel Shetty: నా అల్లుడిని మాత్రమే తిట్టారు.. భరించలేకపోయాను
Suniel Shetty: ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్ (world cup) తర్వాత అంతా కే ఎల్ రాహుల్‌నే (kl rahul) తిడుతుంటే తాను భరించలేకపోయానని అన్నారు నటుడు సునీల్ శెట్టి. మిడిల్ ఆర్డర్లో రాహుల్ స్ట్రైక్ రేట్ బాలేదని కేవలం రాహుల్‌నే టార్గెట్ చేసారని.. అది చూసి రాహుల్ కంటే ఎక్కువ తనకు బాధేసిందని తెలిపారు. సునీల్ కూతురు ఆథియా శెట్టి… కేఎల్ రాహుల్ ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే.
ఎన్నో సార్లు డల్‌గా కూర్చుని ఉండటం చూసి రాహులే తనని ఓదార్చేవాడని.. ఇలాంటి నెగిటివిటీని పట్టించుకుంటే జీవితంలో ముందుకు వెళ్లలేం అని సర్దిచెప్పేవాడని సునీల్ ఓ ఇంటర్వ్యూలో తన మనసులో మాటను బయటపెట్టారు. నాన్నా.. నా క్రికెట్ బ్యాటే వారికి సమాధానం చెప్తుంది అని అంటుండేవాడని.. కానీ రాహుల్ లోలోపల ఎంత బాధపడుతున్నాడో తాను అర్థం చేసుకోగలనని పేర్కొన్నారు. రాహుల్ సునీల్‌ది మామా అల్లుళ్ల బంధం కాదు. రాహుల్‌ని సునీలే తన కూతురికి పరిచయం చేసారు. అలా వారిద్దరూ ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నారు. రాహుల్ సునీల్‌ని నాన్నా అనే పిలుస్తారు. సునీల్ కూడా తనకు ఇద్దరు కాదు ముగ్గురు పిల్లలు అని చెప్తుంటారు.