ఆచి తూచి వ్యవహరించే ప్రధాని.. రౌడీని సీఎంగా ఎందుకు నియమించారు?
Narendra Modi: ప్రధాని నరేంద్ర మోదీ ఎవరినైనా నియమించే ముందు కానీ ఏదైనా పని ప్రారంభించే ముందు కానీ ఎంతో ఆలోచించి ఆచి తూచి నిర్ణయం తీసుకుంటారు. అలాంటిది మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి ఎంపిక విషయంలో ఆయన పెద్ద తప్పు చేసినట్లు రాజకీయ చర్చ జరుగుతోంది. ఈసారి మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా శివరాజ్ సింగ్ చౌహాన్‌ను (shivraj singh chouhan) కాకుండా మోహన్ యాదవ్‌ను (mohan yadav) ఎంపికచేసారు. మోహన్ యాదవ్ స్థానిక ఉజ్జయినిలో మూడు సార్లు గెలిచిన ఎమ్మెల్యే.
అయితే మోహన్ యాదవ్‌పై చాలా సీరియస్ ఆరోపణలు ఉన్నాయి. ఎన్నికలకు ముందు సింహాస్త మేళాకు కేటాయించిన భూమిని వ్యవసాయ భూమిగా ఉంటే రెసిడెన్షియల్ భూమిగా మార్పులు చేసి మోహన్ యాదవ్ భార్య, చెల్లి పేరిట రిజిస్ట్రేషన్ చేయించారని కాంగ్రెస్ నేత జైరామ్ రమేష్ (jairam ramesh) ఆరోపిస్తున్నారు. ఎన్నికలు జరుగుతున్న సమయంలో కూడా మోహన్ యాదవ్ స్థానికులను, ల్యాండ్ డీలర్లను బెదిరిస్తున్న వీడియోలు ఎన్నో బయటికి వచ్చాయని.. అలాంటి రౌడీని మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా మోదీ ఎలా ఎంపికచేస్తారని ప్రశ్నించారు. ఇదేనా మోదీ మధ్యప్రదేశ్ ప్రజలకు ఇచ్చే గ్యారెంటీ అని ఎద్దేవా చేసారు.