NBK 109: బాల‌య్య సినిమాలో బాబీ..!

NBK 109: యానిమ‌ల్ (animal) సినిమాలో విల‌న్ పాత్ర‌లో న‌టించి ప్రేక్ష‌కుల‌కు గూస్ బంప్స్ తెప్పించారు న‌టుడు బాబీ డియోల్ (bobby deol). ఇంత‌కాలం ఇంత మంచి న‌టుడ్నా మ‌నం ప‌క్క‌న పెట్టింది అనే రేంజ్‌లో ఆయ‌న న‌టించారు. ఈ సినిమాతో బాబీ డియోల్ ద‌శ తిరిగిపోయింది. అవ‌కాశాలు వ‌రుస క‌డుతున్నాయి. నంద‌మూరి బాల‌కృష్ణ న‌టిస్తున్న 109వ సినిమాలో బాబీ డియోల్ విల‌న్ పాత్ర‌లో న‌టించే అవ‌కాశం ఉన్న‌ట్లు విశ్వ‌స‌నీయ వ‌ర్గాల స‌మాచారం. అయితే ఈ సినిమాలో ఆయ‌న విల‌న్ పాత్ర‌లో న‌టిస్తారా లేక కీ రోల్ ఇస్తారా అనేది వేచి చూడాలి.