Jagan: 11 స్థానాల్లో ఇంచార్జుల్ని మార్చిన YSRCP

Jagan: ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఎన్నిక‌లు ద‌గ్గ‌ర‌ప‌డుతున్న స‌మ‌యంలో ఏపీ సీఎం జగ‌న్ రాజ‌కీయ పావులు క‌దుపుతున్నారు. రెండోసారి అధికారంలోకి వ‌చ్చేందుకు కావాల్సిన అన్ని ప‌నుల‌ను ప్రారంభించేసారు. ఇప్ప‌టికే మంగ‌ళ‌గిరి పార్టీ ఇన్‌ఛార్జిగా గంజి చిరంజీవిని నియమించ‌డంతో ఆ నియోజ‌క‌వ‌ర్గ ఎమ్మెల్యే ఆళ్ల రామ‌కృష్ణారెడ్డి పార్టీకి రాజీనామా చేసారు. ఈ నేప‌థ్యంలో జ‌గ‌న్ మ‌రో 11 నియోజ‌క‌వ‌ర్గాల్లో ఇన్‌ఛార్జిల‌ను మార్చారు. ఆ నియోజ‌క‌వ‌ర్గాల లిస్ట్ ఇదే..!

రజనీకి అంత ప్రాముఖ్యత ఎందుకో !

చిలుకలూరిపేటలో విడదల రజనీ (vidadala rajani) గెలవడం కష్టమని తేలడంతో.. ఎమ్మెల్యే మద్దాలి గిరిని ప‌క్క‌న పెట్టి ఆమెని గుంటూరు పశ్చిమ ఇంచార్జ్‌గా నియ‌మించారు. ర‌జనీ గెల‌వ‌డం క‌ష్టం అని తేలిన‌ప్పుడు ఆమెకు మ‌ళ్లీ వేరే ప‌ద‌వి ఎందుకు అనే చ‌ర్చ పార్టీలో అంత‌ర్గ‌తంగా మొద‌లైంది