Karnataka: కొడుకు లేచిపోతే త‌ల్లికి దారుణ శిక్ష‌.. బ‌రిలోకి సీఎం

Karnataka: ఓ అబ్బాయి తాను ప్రేమించిన అమ్మాయితో లేచిపోతే.. ఆ అబ్బాయి క‌న్న తల్లికి శిక్ష ప‌డింది. ఈ అమాన‌వీయ ఘ‌ట‌న క‌ర్ణాట‌క‌లో చోటుచేసుకుంది. బెళ‌గావికి చెందిన అశోక్ అనే యువ‌కుడు.. అదే ప్రాంతానికి చెందిన ప్రియాంక అనే అమ్మాయిని ప్రేమించాడు. సోమ‌వారం అర్థ‌రాత్రి వీరిద్ద‌రూ లేచిపోయారు.

విష‌యం తెలుసుకున్న ప్రియాంక త‌ల్లిదండ్రులు అశోక్ ఇంటికి వెళ్లి ఒంట‌రిగా ఉన్న అత‌ని త‌ల్లిపై దాడికి దిగారు. ఆమె దుస్తులు చించి కొట్టి క‌రెంట్ పోల్‌కు క‌ట్టేసి చిత్ర‌హింస‌లు పెట్టారు. పోలీసుల‌కు స‌మాచారం రావ‌డంతో వెంట‌నే వారు బ‌రిలోకి దిగారు. అశోక్ త‌ల్లిని ర‌క్షించారు. దీనిపై క‌ర్ణాట‌క ముఖ్య‌మంత్రి సిద్ధారామ‌య్య స్పందిస్తూ.. ఇది తేలిగ్గా వ‌దిలేయాల్సిన అంశం కాద‌ని.. ఇలా చేసిన గ్రామ‌స్థుల ప‌ట్ల కఠిన చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని తెలిపారు.