War 2: అప్డేట్ వచ్చేసింది.. షూటింగ్ అప్పుడే..!

War 2: యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ (jr ntr) ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న వార్ 2 సినిమాకు సంబంధించి ఒక అప్డేట్ సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతోంది. ప్ర‌స్తుతం దేవ‌ర (devara) షూటింగ్‌తో బిజీగా ఉన్న తార‌క్.. మ‌ధ్య‌లో వార్ 2 షూటింగ్ కోసం డేట్లు కేటాయించ‌లేన‌ని అన్నార‌ట‌. దాంతో ఫిబ్ర‌వ‌రిలో ప్రారంభం కావాల్సిన వార్ 2 షూటింగ్ మార్చి లేదా ఏప్రిల్‌లో జ‌ర‌గ‌నున్న‌ట్లు స‌న్నిహిత వ‌ర్గాలు క‌న్‌ఫామ్ చేసాయి.

దేవ‌ర సినిమాలో జాన్వి క‌పూర్ హీరోయిన్‌గా సైఫ్ అలీ ఖాన్ విల‌న్‌గా న‌టిస్తున్నారు. ఇక వార్ 2 సినిమా గురించి చెప్పాలంటే 2019లో వచ్చిన వార్ సినిమాకు ఇది సీక్వెల్. వార్ సినిమాలో హృతిక్ రోష‌న్, టైగర్ ష్రాఫ్ న‌టించారు. ఇప్పుడు వార్ 2 లో హృతిక్ రోష‌న్, ఎన్టీఆర్ న‌టించ‌బోతున్నారు. అస‌లు ఎన్టీఆర్ ఇలాంటి ఒక హిందీ సినిమా ఒప్పుకుంటార‌ని ఫ్యాన్స్ కూడా ఊహించ‌లేదు. దాంతో ఎప్పుడెప్పుడు తారక్ ఈ సినిమా షూటింగ్ మొద‌లుపెడ‌తారా.. ఎప్పుడెప్పుడు సినిమాకు సంబంధించిన పోస్ట‌ర్ వ‌స్తుందా అని ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఇక బ్ర‌హ్మాస్త్ర సినిమాను తీసిన అయాన్ ముఖ‌ర్జీ వార్ 2 ని డైరెక్ట్ చేస్తారు.