Alla Ramakrishna Reddy: రాజీనామాకు అస‌లు కార‌ణం ఇదేనా?

Alla Ramakrishna Reddy: ఎమ్మెల్యే ఆళ్ల రామ‌కృష్ణారెడ్డి YSRCP పార్టీకి రాజీనామా చేసారు. రెండుసార్లు మంగ‌ళ‌గిరి ఎమ్మెల్యేగా గెలిచిన ఆయ‌న పార్టీకి ఎంతో విధేయుడిగా ఉన్న ఆయన ఎన్నిక‌ల‌కు ఇంకా మూడు నెల‌లు ఉండ‌గా రాజీనామా చేసారంటే YSRCPకి కౌంట్ డౌన్ మొద‌లైపోయిన‌ట్లు అనుకోవ‌చ్చ‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు అంటున్నారు.

రామ‌కృష్ణారెడ్డి రాజీనామా చేయ‌డం వెనుక కార‌ణం మంగళగిరి YSRCP ఇన్‌చార్చ్‌గా గంజి చిరంజీవిని నియమించడం అని అంటున్నారు. అయితే అస‌లు కార‌ణం రానున్న ఎన్నిక‌ల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేల‌లో దాదాపు 50 మందికి జ‌గ‌న్ టికెట్ ఇవ్వ‌న‌ని అంటున్నారు. ఈ నేప‌థ్యంలో మంగ‌ళ‌గిరిలో రామ‌కృష్ణ‌కు కాకుండా ఓ బీసీ నేత‌కు టికెట్ ఇస్తార‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. దాంతో రామ‌కృష్ణ ముందే ఊహించి రాజీనామా చేసిన‌ట్లు తెలుస్తోంది. ఇది YSRCP పార్టీ నుంచి వైదొలిగిన ఫ‌స్ట్ వికెట్ అని తెలుగు దేశం (TDP), జ‌న‌సేన (janasena) నేత‌లు చెప్పుకుంటున్నారు.