Article 370 రద్దు నిర్ణయం సరైనదే అని తేల్చి చెప్పిన సుప్రీంకోర్టు
Article 370: జమ్మూ కాశ్మీర్‌కు (jammu and kashmir) స్వయం ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370ని రద్దు చేయాలి అనేది కేంద్ర ప్రభుత్వం నిర్ణయం అని దీనిని రద్దు చేయాలా వద్దా అనేది సుప్రీంకోర్టు (supreme court) చేతిలో ఉండదని భారత ప్రధాన న్యాయమూర్తి చంద్రచూడ్ తెలిపారు. అలాగని కేంద్ర ప్రభుత్వం నిర్ణయాన్ని కొట్టిపారేయలేమని తెలిపారు. ఐదు న్యాయమూర్తుల ధర్మాసనం ఆర్టికల్ 370 రద్దు విషయంలో మూడు భిన్నాభిప్రాయాలు వెల్లడించారు.
రాష్ట్రపతి పాత్రలో కేంద్రం రాష్ట్ర ప్రభుత్వ అధికారాన్ని వినియోగించుకోవచ్చు. జమ్మూ కశ్మీర్ రాష్ట్రం తరఫు పిటిషనర్ల వాదనలను తోసిపుచ్చిన భారత ప్రధాన న్యాయమూర్తి.. ప్రకటన ప్రకారం పార్లమెంటు/రాష్ట్రపతి రాష్ట్ర శాసన అధికారాలను వినియోగించుకోవచ్చని అన్నారు. రాష్ట్రపతి పాలనలో కేంద్రం ఎలాంటి తిరుగులేని చర్యలు తీసుకోదన్న పిటిషన్ వాదనను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. భారతదేశంలో చేరిన తర్వాత, జమ్మూ కాశ్మీర్ సార్వభౌమాధికారాన్ని నిలుపుకోలేదు. విలీనంతో జమ్మూ కాశ్మీర్ తన పూర్తి సార్వభౌమాధికారాన్ని వదులుకుంది. జమ్మూ కాశ్మీర్‌కు కూడా అంతర్గత సార్వభౌమాధికారం లేదు. దీని రాజ్యాంగం భారత రాజ్యాంగం కిందే ఉండేది అని తెలిపారు. (article 370)
ఆర్టికల్ 370 అనేది కేవలం తాత్కాలిక నిబంధన మాత్రమే అని దీనిని శాశ్వతం అనుకుంటే జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం పొరపాటు పడినట్లు అవుతుందని చంద్రచూడ్ పేర్కొన్నారు. ఆర్టికల్ 370ని రద్దు చేయడానికి ముందు రాజ్యాంగ పరిషత్ సిఫార్సు అవసరం లేదని కూడా స్పష్టం చేసారు. జమ్మూ కాశ్మీర్ రాజ్యాంగ పరిషత్ రద్దయిన తర్వాత కూడా ఆర్టికల్ 370 రద్దు నోటిఫికేషన్ ఇచ్చే రాష్ట్రపతి అధికారం కొనసాగుతుందని ఆర్టికల్ 370ని రద్దు చేస్తూ రాష్ట్రపతి ఉత్తర్వులు ఇస్తే అది రాజ్యాంగ బద్ధంగా చెల్లుబాటయ్యే ప్రక్రియ అని తెలిపారు. అసాధారణమైన పరిస్థితులను మినహాయించి, ఆర్టికల్ 370 రద్దు నిర్ణయంపై రాష్ట్రపతి అప్పీల్‌లో జోక్యం చేసుకోలేమని పేర్కొన్నారు. (article 370)
ఒక్క మాటలో చెప్పాలంటే ఆర్టికల్ 370 అనేది జమ్ము కాశ్మీర్‌లో యుద్ధ వాతావరణాన్ని నెలకొల్పిందని.. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ప్రతీ నిర్ణయాన్ని సవాలు చేయడానికి వీల్లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. జమ్మూకశ్మీర్‌కు వీలైనంత త్వరగా రాష్ట్ర హోదా కల్పించి, అక్కడ ఎన్నికలు నిర్వహించాలని కూడా సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఒకప్పటి రాష్ట్ర హోదా వీలైనంత త్వరగా ఇవ్వాలని లడఖ్‌ను కేంద్ర పరిపాలిత ప్రాంతంగా చేయాలన్న నిర్ణయం మాత్రం అలాగే ఉందని అన్నారు. 2024 సెప్టెంబర్‌లోగా జమ్మూ కాశ్మీర్‌లో ఎన్నికలు నిర్వహించాలని ఎన్నికల సంఘాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది.