Chinmayi: శిక్ష పడినా బెయిల్‌పై వచ్చేస్తాడు.. టాలీవుడ్ పట్టించుకోదా?
Chinmayi Sripada: పుష్ప (pushpa) నటుడు జగదీష్ బండారిపై (jagadish bandari) సంచలన వ్యాఖ్యలు చేసారు సింగర్ చిన్మయి శ్రీపాద. జూనియర్ ఆర్టిస్ట్‌గా పనిచేస్తున్న ఓ అమ్మాయి నగ్న వీడియోలు, ఫోటోలు తీసి అవి సోషల్ మీడియాలో పెడతానని బెదిరించడంతో ఆ అమ్మాయి నవంబర్‌లో సూసైడ్ చేసుకుంది. దాంతో హైదరాబాద్‌లోని పంజాగుట్ట పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై చిన్మయి ట్విటర్ ద్వారా స్పందించారు.
“” చనిపోయిన ఆ అమ్మాయి టాలీవుడ్లో లైంగిక వేధింపులు చేస్తున్నవారి పట్ల చర్యలు తీసుకుంటారు అన్న విషయం తెలిసి ఉంటే ఆమె ధైర్యం చేసి ఫిర్యాదు చేసేది. కానీ ఆమెకు టాలీవుడ్లో ఇలాంటి ఒక కమిటీ ఉందని కూడా తెలీదనుకుంటా. అందుకే ఈ వ్యక్తి ఒక అమ్మాయి జీవితాన్ని సులువుగా నాశనం చేయాలనుకోవడంతో ఆమె చనిపోయింది. ఇలాంటి కేసుల్లో మన భారత చట్టం ఎలా పనిచేస్తుందో అందరికీ తెలిసిందే. ఈ కేసు వాదోపవాదాలు అయ్యేసరికి కొన్నేళ్లు పడుతుంది. ఈలోగా నిందితుడు గుర్మీత్ రామ్ రహీమ్ లాగా త్వరగా బెయిల్‌పై బయటికి వచ్చేస్తాడు “” అని మండిపడ్డారు చిన్మయి.
ఇంత జరిగిన తర్వాత కూడా జగదీష్ ఎప్పుడెప్పుడు బయటికి వస్తాడా పుష్ప సినిమా ఎప్పుడు పూర్తవుతుందా అని టీం వెయిట్ చేస్తుండడంపై చిన్మయి పరోక్షంగా అసహనం వ్యక్తం చేసారు. అతను ఓ అమ్మాయి జీవితాన్ని నాశనం చేసాడు అని తెలిసీ ఇంకా ఎలా సినిమాల్లో అవకాశాలు ఇస్తారు అనే దానిపై ఆమె బాధను వ్యక్తం చేస్తున్నారు.