Whatsapp గ్రూప్ నుంచి తొలగించిన బాస్.. ఉద్యోగి ఏం చేసాడో తెలుసా?
Whatsapp: ఒక కంపెనీలో ఉద్యోగం చేస్తున్నామంటే ఎంత కోపం, చిరాకు, ఒత్తిడి ఉన్నా కూడా మన ప్రవర్తన సరైనదిగా ఉండాలి. అప్పుడే మనల్ని మనం కాపాడుకోగలం. అంతేకానీ కోపంతో బాస్‌పై కొలీగ్స్‌పై చేయి చేసుకోవడం వంటి పనులు చేస్తే ముందు ముందు ఏ కంపెనీలు కూడా అలాంటి ఉద్యోగులను తీసుకోవు. మహారాష్ట్రలోని పుణెలోకి చెందిన ఇన్‌స్టా గో ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీలో ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. ఈ కంపెనీలో సత్యం సింఘ్వి పనిచేస్తున్నాడు. అయితే సత్యం కంపెనీలోని అందరు ఉద్యోగులతో దురుసుగా ప్రవర్తిస్తున్నాడని.. కొందరిపై చేయి కూడా చేసుకున్నాడని ఆ కంపెనీ బాస్ అయిన అమోల్‌కు తెలిసింది.
దాంతో వివరణ ఇవ్వాల్సిందిగా అతనికి ఆదేశాలు జారీ చేసారు. ఎన్నిసార్లు నోటీసులు పంపినా కూడా అతని నుంచి రిప్లై లేకపోవడంతో అమోల్ అతన్ని వాట్సాప్ గ్రూప్ నుంచి తొలగించాడు. ఈ విషయం తెలిసి సత్యం ఓ వెదురు కర్రతో ఆఫీస్‌లోకి దూసుకెళ్లి కంప్యూటర్లు పగలగొట్టి అమోల్‌ను కూడా కొట్టాడు. అంతటితో ఆగకుండా అతని ఫోన్ కూడా పగలగొట్టాడు. దాంతో అమోల్ పోలీసులకు ఫిర్యాదు చేసారు. ప్రస్తుతం సత్యం పోలీసుల అదుపులో ఉన్నాడు.